టాలీవుడ్ లో చైల్డ్ యాక్టర్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు భరత్. ఇక ఈ యువ హీరో చిన్నతనంలోనే బాలనటుడిగా స్టార్ హీరోల సినిమాలలో నటించాడు. అప్పట్లో తన మాటలతో, తను వేసే డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వారు. ఇప్పుడు తాజాగా హీరోగా కొన్ని సినిమాలలో కూడా నటించాడు. అయితే ఇతని మొదటి సంపాదన ఎంతో ఇప్పుడు చూద్దాం.

చైల్డ్ యాక్టర్ గా వెంకీ, పోకిరి, దుబాయ్ శీను, రెడీ, డి వంటి చిత్రాలలో మంచి పేరు తెచ్చుకున్నాడు నటుడు భరత్. తమిళనాడులో ఉన్న భరత్ 2002 సంవత్సరంలో వచ్చిన" నైనా" అనే సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. అది కూడా తమిళ చిత్రం. ఆ తరువాత ఆనందమానందమాయే అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. చైల్డ్ యాక్టర్ గా కామెడీ పండించడంలో సీనియర్ హీరోలను మించిపోయాడు.


దాంతో ఈ చైల్డ్ యాక్టర్ భరత్ కు అవకాశాలు బాగా వచ్చాయి. ఆ రోజుల్లో తన దగ్గరికి ఎటువంటి సినిమా ఆయన వస్తే కచ్చితంగా వాటిని ఒప్పుకొని కొద్దికాలంలోనే దాదాపుగా 60 సినిమాలకు పైగా నటించాడు. భరత్ పూర్వీకులు మాత్రం తెలుగువారే. అయితే చాలా కాలం కిందటే తమిళనాడుకి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. ఇక భరత్ స్కూల్ లో కొన్ని కామెడీ సన్నివేశాలను వేయడం వల్ల ఇతనికి అవకాశం వచ్చింది.


అయితే వాస్తవానికి భరత్ ను డాక్టర్ గా చూడాలనేది వారి తల్లిదండ్రుల కళ. కానీ భరత్ మాత్రం యాక్టింగ్ వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో తల్లిదండ్రులు కూడా ఏమి అనలేక పోయారు. వయసు పెరుగుతున్న కొద్దీ బాలనటుడిగా వేశాలు తగ్గుతుండటంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఆలోచించాడు. కానీ అల్లు శిరీష్ తో కలిసి..ABCD సినిమా తో ఫ్రెండ్ క్యారెక్టర్స్ తో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాతో తన కెరియర్ మారిపోతుందని అనుకున్నాడు. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. అయితే తను మొదట తీసుకున్న రెమ్యూనరేషన్ 4500 అన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: