ఇక భయంకరమైన దుస్తులు ధరించి, రకరకాల వింతైన గెటప్పుల్లో కూడా ఫన్ క్రియేట్ చేశారు.. మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో సరదా హాలోవీన్ పార్టీ వీడియోని కూడా షేర్ చేసి అందరినీ షాక్ కి గురి చేశాడు.. తన అభిమానులకు హ్యాపీ హాలోవీన్ శుభాకాంక్షలు కూడా తెలిపాడు.. ఇక చిరంజీవి తన మేకోవర్ కోసం సరికొత్త యాప్ ని ఉపయోగించారని తెలుస్తోంది. అంతేకాదు ఈ వీడియోని ఆయన షేర్ చేస్తూ ఉత్కంఠభరితమైన రోజు అని కింద క్యాప్షన్ కూడా పెట్టారు.
ఈ వీడియోలో చిరు తన ముఖాకృతిని మార్చుకుంటూ ఎంతో చమత్కారంగా మనకు కనిపిస్తాడు.. ఆయన కళ్లు ఎర్రబడటం.. తర్వాత విభిన్నమైన ఆహార్యంతో కనిపించడం చూస్తే ఎంతో ఫన్ గా అనిపించింది.. అంతేకాదు ఈ వీడియోని ఆయన మనవడు, మనవరాలు కూడా చూసి ఎంతో అద్భుతంగా ఉంది అంటూ కితాబు కూడా ఇచ్చేశారు.. ఇక సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఈయన నటించిన ఆచార్య సినిమా 2022 ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కాబోతోంది. ఇక తర్వాత గాడ్ ఫాదర్ భోళా శంకర్ , వాల్తేర్ శీను వంటి సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి