శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఈటీవీ లో  ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ప్రతి సండే ని బుల్లితెర ప్రేక్షకులకు ఫన్ డే మార్చేస్తుంది. ఇక ప్రతి వారం కూడా సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఇతర ప్రేక్షకులందరినీ కూడా కడుపుబ్బ నవ్విస్తుంది. ప్రస్తుతం టామ్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా ఒక చోట చేరి అదిరిపోయే కామెడీ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు అని చెప్పాలి. ఈ కార్యక్రమంలో కేవలం కామెడీ మాత్రమే కాదు అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్.. అన్ని కలగలిపి ఉంటాయి. దీంతో ఇక ఈ షో చూసేందుకు బుల్లితెర ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపుతున్నారు.


 కాగా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ షోలో జడ్జిగా సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కొనసాగుతోంది. ఇకపోతే ప్రతి వారం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో తెర మీదికి వచ్చి ఈ కార్యక్రమం.. ఇక వచ్చే వారం కూడా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమైంది అన్నది అర్ధమవుతుంది. ఇటీవలే వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదల కాగా.. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో చూసి అందరూ పగలబడి నవ్వు కుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.




 అయితే ఇప్పుడు వరకు జబర్దస్త్ కార్య క్రమంలో పలు సన్నివేశాలను పూర్తి చేసి అందరినీ నవ్వించడం చూసాము.  ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా ఇలాంటి స్పూఫ్ వీడియో చేసి నవ్వించారు  మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు
సినిమా టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రికార్డులు బద్దలు కొట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఏకంగా మహేష్ బాబు ఒక సన్నివేశంలో రాయిని గుద్దితే రాయ్ పగిలిపోతుంది. ఇక ఆ సన్నివేశాన్ని స్పూఫ్ తీశారు. ఇక ఈ స్పూఫ్ లో చెప్పిన డైలాగులు అన్నీ కూడా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: