వరుస సక్సెస్ లతో హీరోగా దూసుకుపోతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం గని అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అల్లు బాబీ మరియు సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణ లో వస్తున్న ఈ సినిమా తో అల్లు వారి పెద్దబ్బాయి పూర్తిస్థాయి నిర్మాతగా మారుతున్నారు. వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని అప్డేట్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఈ సినిమాలోని బాక్సింగ్ సన్నివేశాల కోసం చాలా స్పెషల్ గా వరుణ్ ట్రైన్ అయ్యాడు. జాతీయ అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్స్ వద్ద ఆయన ట్రైనింగ్ తీసుకుని మరి ఈ చిత్రంలో నటిస్తుండగా ఇటీవలే ఆయన ట్రైనింగ్ చేస్తున్న ఫోటోలు వీడియోలు విడుదల అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన రొమాంటిక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. వరుణ్ జోడిగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా ఈమె తెలుగులో మొదటి సారి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె మహేష్ బాబు భార్య నమ్రత సన్నిహితులు అని టాక్ వినిపిస్తుంది.
ఇక డిసెంబర్ 3వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం గట్టి ప్రయత్నాలు చేస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ని మొదటి పాట ఇప్పటికే విడుదల కాగా భారీ రెస్పాన్స్ భారీ ఎత్తున ఈ సినిమాతో పాటు వరుణ్ కూడా చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ తో కలిసి స్క్రీన్ పంచుకుంటున్నాడు ఏదేమైనా వరుస సినిమాలతో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ కు ఇప్పుడు ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి మరి ఆయన అభిమానులు ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో చేస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి