సాధారణంగా ప్రముఖ నటీనటులు సినిమాల్లో మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు.. కానీ వీరు ఇచ్చే సలహాలు కొంత మందికి ఆదర్శంగా నిలుస్తూ వుంటే, మరికొంతమందిలో సంచలనం సృష్టిస్తున్నాయి.. ముఖ్యంగా సినిమా వాళ్ళు ఏదైనా చెబితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది.. అన్నమాట పక్కన పెడితే తమ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలను ఆధారంగా చేసుకొని, జనాలకు మరీ దారుణంగా సలహాలు ఇస్తున్నారు.. అలాంటి వారిలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్త కూడా ఒకరు.

అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్న నీనా గుప్తా, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టింది.. ఆతర్వాత దర్శకురాలిగా తనలో ఉన్న ప్రతిభను చాటింది.. నీనా గుప్తా సాధారణంగా  సోషల్ మీడియా ద్వారా నెటిజనులకు ఏవో రకరకాల సలహాలు ఇస్తూ ఉంటుంది.. ఈ నేపథ్యంలోనే ఈమె తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ఇచ్చిన ఒక సలహా ప్రస్తుతం ప్రతి ఒక్కరి లో సంచలనంగా మారింది..

నీనా గుప్తా ఏమని చెప్పారంటే.. పెళ్లయినా మగవాడిని ప్రేమిస్తే తమ కళ్ళకు మస్కారా పెట్టుకోవద్దని ఈమె తెలిపింది. ఎందుకంటే ముందే పెళ్లి అయిన మగాడిని గనుక ప్రేమిస్తే చివరకు మిగిలేది కన్నీళ్లే కాబట్టి ఆ ఉద్దేశంతోనే నీనా గుప్తా చెప్పినట్లు సమాచారం.. అయితే ఈమె నిజ జీవితంలో తాను ఎదుర్కొన్న ఒక అతిపెద్ద సమస్య అని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పట్లో నీనా గుప్తా కూడా ఒక పెళ్లి అయిన వ్యక్తిని ప్రేమించి, చివరకు ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది.. కాని అతను కాదని వెళ్లిపోవడంతో ఇక ఆమె ఆ బిడ్డ తోనే జీవితం కొనసాగిస్తూ వస్తోంది. ఇక తనలాగే చాలామంది నటీమణులు కూడా పెళ్లయిన మగవాడిని ప్రేమించి మోసపోయారు అని, ఆ అనుభవంతోనే ఈమె సలహా ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. ప్రస్తుతం నీనా గుప్తా పెట్టిన పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: