ఇటీవల కాలంలో
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా ఛాన్స్ రావాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి అని
సినిమా విశ్లేషకులు చెబుతున్న మాట. ఎందుకంటే భారీ కాంపిటీషన్ ఇప్పుడు
హీరోయిన్ మధ్య నెలకొని ఉండడంతో ఒక పెద్ద
హీరో సినిమాలో అవకాశం రావాలంటే చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. నిజానికి ఒకటి రెండు సినిమాల తర్వాత
సక్సెస్ వచ్చిన తర్వాత పెద్ద హీరోల సినిమాల అవకాశాలు వస్తుంటాయి. కానీ కొంతమందికి తొలి సినిమాతోనే పెద్ద హీరోల సరసన చేసే అవకాశం లభిస్తుంది. ఆ విధంగా ఓ
హీరోయిన్ పెద్ద సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీగా ఉంది.
ఈ
సినిమా మాత్రమే కాదు ఆమె మరి కొన్ని సినిమాలను కూడా ప్రేక్షకులను అలరించడానికి త్వరలో ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మరొక సినిమాకి కూడా ఒప్పుకున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. మెగా
హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాకు సంయుక్త
మీనన్ హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తుంది. తాజాగా
సాయి ధరమ్ తేజ్ కు
యాక్సిడెంట్ కాగా ఆ ప్రమాదం నుంచి ఇప్పుడు పూర్తిగా కోలుకొని తన తదుపరి
సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన కొత్త
సినిమా హీరోయిన్ గా ఆమెను తీసుకోవాలని అందరూ భావిస్తున్నారట.
తొలినాళ్ళలో సినిమాల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేసి భారీ ఫ్లాపులు సొంతం చేసుకున్న సాయి తేజ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటూ ముందుకు పోతున్నాడు. ఈ నేపథ్యంలోనే
కార్తీక్ దర్శకుడిగా ఆయన ఆ
సినిమా కోసం ఈమె ఎంపికయినట్లు తెలుస్తోంది. ఇక గాయం నుంచి కోలుకున్న సాయి ధరంతేజ్ మునుపటిలా యాక్టివ్ గా షూటింగ్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాతో పాటు మరికొన్ని
సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. ఇప్పటివరకు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ వచ్చిన సాయి ధరంతేజ్ ఇకపై ఎలా ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి.