
అయితే ఇటీవలే కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా రవి మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అయ్యాడు అనే విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే సోమవారం రోజున నామినేషన్స్ కూడా జరిగాయి. ఇక ఈ నామినేషన్స్ లో ఒకరిపై ఒకరు విమర్శలు.. నామినేట్ చేయడానికి చెప్పిన కారణాల తో ఒక్కసారిగా హౌస్ మొత్తం హాట్ హాట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరో సారి కెప్టెన్సీ టాస్క్ మొదలయ్యింది. ఎవరు ఎక్కువ బంగారాన్ని సాధిస్తే వారే కెప్టెన్సీ పోటీదారులు గా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ చెప్పడంతో ఇక అందరూ కెప్టెన్సీ దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే అందరూ కలిసి ఇక బిగ్ బాస్ ఏర్పాటు చేసిన ఒక టబ్లో దిగి బంగారం వెతికి వారికి కేటాయించిన ప్రత్యేకమైన బాక్సులలో బంగారం బాల్స్ ని వేస్తున్నారు. ఈక్రమంలోనే అనీ మాస్టర్ అక్కడికి వచ్చి ఎలాంటి కష్టం లేకుండా ఇక్కడ అందరూ వెతికి పెట్టిన బంగారం దొంగలిస్తే పోలా అంటూ సమాధానం చెబుతుంది. ఈ గేమ్ లో ఇదేనా స్ట్రాటజీ అంటూ చెబుతుంది అనీ మాస్టర్. అంతేకాదు ఇక దొంగలించెందుకు అంతా రెడీ కూడా చేసుకుంటుంది. ఇలా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ లో అనీ మాస్టర్ కాస్త దొంగ గా మారిపోయింది.