గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున 'ఘోస్ట్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ ల పై నారాయణ దాస్ నారంగ్, శరత్మరార్ లు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరోయిన్ గా మొదట కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇక హీరో తో పాటు ఈ సినిమాలో ఉండే భారీ యాక్షన్ సీక్వెన్స్ లో కాజల్ అగర్వాల్ కూడా పాల్గొనవలసి ఉంది. అయితే ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

 దీంతో సినిమా మేకర్స్ హీరోయిన్ అమలాపాల్ ను సంప్రదించారు. అయితే అమలాపాల్ ఈ సినిమాకి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆమెను కాస్త పక్కన పెట్టారు. అయితే నిజానికి టాలీవుడ్ లో అమలాపాల్ కి ఈ సినిమా మంచి రీ ఎంట్రీ సినిమా అనే చెప్పాలి. కానీ ఎందుకనో ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఇక అమలాపాల్ తో పాటు మరో హీరోయిన్ మెహరీన్ ని కూడా చిత్ర యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆమె కూడా కోటి రూపాయలకు పైగా పారితోషికం అడిగిందని ఆమెను కూడా లైట్ తీసుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రస్తుతానికి ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు మేకర్స్.

అయితే ఘోస్ట్ సినిమాలో హీరోయిన్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ఈ సినిమా అమలాపాల్ తో పాటు మెహరీన్ కి కూడా మంచి ఛాయిస్ అని చెప్పాలి. కానీ ఈ ఇద్దరు హీరోయిన్లు రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో వీళ్ళని వద్దనుకున్నారు మేకర్స్. ఇక ప్రస్తుతం హీరోయిన్ వెతుకులాటలో సినిమా టీం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నాగార్జున సరికొత్త అవతారంలో దర్శనం ఇచ్చారు. దీంతో సినిమాపై అంచనాలు కూడా భారీగానే పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: