అయితే మెగాస్టార్ చిరంజీవి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబమే. కానీ చిత్ర పరిశ్రమలోకి వచ్చి రాణించాలన్నా సంకల్పం మాత్రం చాలా బలంగా ఉంది. ఇలాంటి సమయంలోనే పునాదిరాళ్లు అనే సినిమాలో చిరంజీవికి అవకాశం వచ్చింది. అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు చిరంజీవి. తన నటనతో దర్శకులను ఆకర్షించాడు. ఇలా చిరంజీవి కెరియర్ మొత్తం నత్తనడకన సాగుతూ పోతున్న సమయంలో.. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ సినిమా మాత్రం చిరంజీవికి ఒక బిగ్ బ్రేక్ ఇచ్చింది అని చెప్పాలి. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇక టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు అని అందరూ చర్చించుకుంటున్న సమయంలో అది నేనే అనే ఖైదీ సినిమాతో నిరూపించాడు చిరంజీవి.
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులను కొల్లగొట్టింది. అంతేకాదు చిరంజీవికి ఒక్కసారిగా మాస్ ఫాలోయింగ్ తెచ్చింది. కోదండ రామిరెడ్డిని కూడా ఒక్కసారిగా అగ్ర దర్శకుడి గా మార్చేసింది. ఇలా ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఖైదీ సినిమా ఎవర్గ్రీన్ సినిమాగా మారిపోయింది. అయితే సాధారణంగా సినిమా కథలు రాయటానికి చాలా రోజుల టైం తీసుకుంటూ ఉంటారు రైటర్స్. ఖైదీ లాంటి కొత్త కాన్సెప్ట్ తో సినిమా గురించి అయితే మరింత టైం తీసుకుంటూ ఉంటారు. సినిమాకు స్టోరీ అందించిన పరుచూరి బ్రదర్స్ మాత్రం కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఖైదీ సినిమా స్టోరీ రెడీ చేశారట. స్టోరీ డైలాగ్ లు మొత్తం పూర్తి చేసి కోదండరామిరెడ్డికి ఇచ్చారట.. ఇక ఈ ఖైదీ సినిమా సూపర్ హిట్ కావడంతో పరుచూరి బ్రదర్స్ కి కూడా ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి