ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా ప్రగ్యాజైశ్వా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్,టీజర్,పాటలు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌తో ట్రైలర్‌కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రబృందం బాలయ్య అభిమానులకు మంచి కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చారు. తాజాగా మేకర్స్ బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ ని రిలీజ్ చేసారు. అఖండ చిత్రం కు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చిందని చిత్ర బ్రందం తెలిపింది.
నిజానికి బాలయ్య సినిమాలకు యూఏ సర్టిఫికెట్ రావడం చాలా కామన్. ఇక అఖండకు ఇలానే వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలు సంబంధించిన కొత్త పోస్టర్‌తో రిలీజ్ చేస్తూ..మేకర్స్ అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. డిసెంబర్ 2వ తేదీన బాలయ నటించిన అఖండ సినిమా అన్నీ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుందని పోస్టర్ రిలీజ్ చేస్తూ మేకర్స్ క్లారిటి ఇచ్చారు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లో బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్ ఇద్దరు జీపులో కూర్చొని టీ తాగుతున్నట్లుగా స్టైలిష్ లుక్‌లో ఉన్నారు. పోస్టర్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక ఈ లుక్ తో సినిమాపై ఉన్న క్రేజ్ మరింత పెంచేస్తుంది అంటున్నారు బాలయ్య అభిమానులు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి