‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన ‘నాటు నాటు’ పాట ఒక సంచలనం. ఇప్పటికే 26 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఈ పాటను చూడటమే కాకుండా వేల సంఖ్యలో ఈ పాటకు లైక్స్ కూడ వస్తున్నాయి. అంతేకాదు అనేకమంది ఈ పాటలోని జూనియర్ చరణ్ ల స్టెప్స్ ను అనుకరిస్తూ వేల సంఖ్యలో వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాము కూడ జూనియర్ చరణ్ లానే భావిస్తున్నారు.


అయితే ఈ పాట చిత్రీకరణ సమయంలో రాజమౌళి జూనియర్ చరణ్ లతో అనేకసార్లు ఈ పాటకు సంబంధించిన స్టెప్స్ ను రిహార్సిల్స్ చేయించడమే కాకుండా చరణ్ తో తాను వేసే స్టెప్స్ సింక్ అవ్వడం కోసం ఒకొక్క స్టెప్ కు సంబంధించి 15 నుంచి 18 టేక్ లు తీసుకున్నాడట. ఈ పాట చిత్రీకరణ సమయంలో తాము అలిసిపోయామని చెప్పినా వినకుండా మళ్ళీ రీ టేక్ రీ టేక్ అంటూ తమ సహనాన్ని విపరీతంగా పరీక్షించాడని జూనియర్ గగ్గోలు పెడుతున్నాడు.


జూనియర్ చరణ్ ల మధ్య స్టెప్స్ వేస్తున్నప్పుడు ఆ స్టెప్స్ కరెక్ట్ గా సింక్ అవుతున్నాయా లేవా అన్న దృష్టితోనే రాజమౌళి ఉండేవాడు కానీ తాము పడుతున్న కష్టం గురించి ఎప్పుడు పట్టించుకోలేదు అంటూ జోక్ చేసాడు. ఈ మూవీలోని కొన్ని స్టెప్స్ ప్రాక్టీస్ చేయడానికి డాన్స్ బాగా వచ్చిన తనకు కూడ 12 గంటలు పట్టిందని ఒకొక్కసారి కాళ్ళు విపరీతంగా లాగిన సందర్భాలు కూడ ఉన్నాయి అంటూ జూనియర్ ఆ పాట గురించి తాను పడ్డ కష్టాలను బయట పెట్టాడు.


వాస్తవానికి ఈ పాట కంపోజింగ్ చాల సులువుగా కనిపిస్తున్నప్పటికీ అంత సులువు కాదనీ ఈ పాటకు ఇద్దరి హీరోల కాళ్ళు సింక్ అవ్వడం పరిపూర్ణంగా జరగకపోతే ఆ పాటకు అంత క్రేజ్ వచ్చి ఉండేది కాదు అంటూ జూనియర్ అభిప్రాయపడుతున్నాడు. అయితే ఈపాట విడుదల అయ్యాక వస్తున్న ప్రశంసలు చూస్తుంటే తాను చరణ్ తో కలిసి పడ్డ కష్టాన్ని పూర్తిగా మర్చిపోయానని అంటున్నాడు..మరింత సమాచారం తెలుసుకోండి: