విక్టరీ వెంకటేష్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న దృశ్యం 2 సినిమా విడుదలయింది. అయితే అందరూ థియేటర్ వేదికగా విడుదల అవుతుంది అని భావించినప్పటికీ చివరికి అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది ఈ సినిమా. అయితే ఇప్పటికే వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాలని అంటే కాంత రిస్కుతో కూడుకున్న పని. ఎందుకంటే ఎక్కడ కాస్త తేడా వచ్చిన కూడా చివరికి సినిమా ప్లాప్ గా మిగిలిపోతుంది. కానీ అటు దర్శకుడు జీతూ జోసెఫ్ దృశ్యం సినిమాతోనే ప్రేక్షకుడిని అదిరిపోయే ట్విస్ట్ లతో మంత్రముగ్ధుల్ని చేశాడు. ఇక ఇప్పుడు దృశ్యం  2 సినిమా విషయంలో కూడా సస్పెన్స్ త్రిల్లర్ సినిమాను తెరకెక్కించడంలో తన పట్టు ఏంటో చూపించాడు దర్శకుడు. సరిగ్గా దృశ్యం సినిమా ఎక్కడ ఆగిపోతుందో దృశ్యం 2 సినిమా అక్కడే మొదలవుతుంది అని చెప్పాలి. అయితే ఒకప్పుడు కేబుల్ ఆపరేటర్ గా ఉన్న రాంబాబు ఇక దృశ్యం 2 సినిమాలో మాత్రం బాగా సంపాదించి ఏకంగా ఒక థియేటర్ ఓనర్ గా మారిపోతాడు. అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో దృశ్యం సినిమా లో క్లోస్ అయినా మర్డర్ కేస్ మళ్లీ దృశ్యం 2 లో రీ ఓపెన్ అవుతుంది. ఇక ఇలా కేస్ రి ఓపెన్ అవ్వడమే ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్ గా చూపించాడు దర్శకుడు జీతూ జోసెఫ్. దృశ్యం 2 సినిమా ఇక సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కూడా మునివేళ్ళపై నిలబెడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ఇక హత్యకేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఐజి గౌతమ్ సాహూ పాత్రలో సంపత్ రాజు ఎంట్రీ ఇస్తాడు. ఇక ఈ ఎంట్రీ తో సినిమా మరింత ఉత్కంఠభరితంగా మారిపోతుంది. ఇక ఐజీ గౌతమ్  సాహూ కి దొరికిన ఆధారాలు ఏంటి.. రాంబాబు ఏం చేశాడు అన్నది కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. పోలీస్ శాఖ ఎవరికి తెలియకుండా కేస్ ఇన్వెస్టిగేషన్  చేస్తుంది అన్న విషయాన్ని బయటపెట్టి ప్రేక్షకులకు ట్విస్ట్ ఇస్తాడు దర్శకుడు. అక్కడి నుంచి మొదలైన కథాకథనాలు చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు గుండె వేగం కూడా పెరిగిపోతుంది.. ఇక అంతలోనే రాంబాబు తానే హత్య చేశాను అంటూ ఒప్పుకుంటూ పోలీసులకు లొంగిపోతాడు.


 ఇక ఇలా రాంబాబు లొంగిపోవడం మాత్రం ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్ అని చెప్పాలి. అయితే అంతకుముందు ఇక రాంబాబు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వేసే ఎత్తులు పై ఎత్తులతో సినిమా మొత్తం ఉత్కంఠ భరితంగా సాగిపోతూనే ఉంటుంది. అయితే రాంబాబు పోలీసుల ఎదుట లొంగిపోవటంతో అందరూ షాక్ అవుతారు. కథ ముగిసిపోయింది అని అనుకుంటారు. కానీ ఆ తర్వాత కూడా ఊహించని ట్విస్ట్ లను కథ లో పెట్టిన దర్శకుడు ప్రతి ప్రేక్షకుడి లో కూడా ఉత్కంఠను రేకెత్తించాడు. ఇలా దృశ్యం రెండు సినిమాల్లో ఉన్న ప్రతి ట్విస్టు కూడా అటు ప్రేక్షకులందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి. ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ ను అద్భుతంగా తెరకెక్కించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు జీతూ జోసెఫ్.

మరింత సమాచారం తెలుసుకోండి: