తెలుగు చిత్ర పరిశ్రమలో బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకులందరికీ పూనకాలు వచ్చేస్తాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా లో ఆ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఇక ఈ యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తు ఉంటాయి. ఇక ఇటీవలే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన అఖండ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇక ఈ సినిమాపై అటు ప్రేక్షకులందరూ భారీ రేంజ్ లోనే అంచనాలు పెంచుకున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఏకంగా బాలకృష్ణ రెండు పాత్రలలో కూడా కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. అయితేభారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ సినిమా గురించి ప్రస్తుతం భిన్నమైన టాక్ వినిపిస్తుంది. కొంతమంది బాగుంది అని చెబుతుంటే ఇంకొంతమంది మాత్రం అరెరే బాలయ్య ఈసారి కూడా మెప్పించలేకపోయాడు అంటూ నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా సినిమాలో అఖండ అనే పాత్ర ఎంతో హైలెట్గా నిలుస్తుందని ప్రేక్షకుల అంచనాలు పెట్టుకున్నారు. ఈ గెటప్ కేవలం బాలయ్యకు కృత్రిమంగా మాత్రమే ఉంది అన్న టాక్ వినిపిస్తోంది.


 లెజెండ్ సినిమాలోని బిగ్ బ్రదర్ వేషధారణను పోలి అన్నట్లుగానే అటు అఖండ సినిమాలో కూడా అఖండ పాత్ర ఉంటుంది అని అంటున్నారు కొంతమంది ప్రేక్షకులు. ఈ సినిమాలో ఈ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని  ప్రేక్షకుల అంచనాలు పెట్టుకోగా ఈ పాత్రలో కొత్తదనం ఏమీ లేదు అని భావిస్తున్నారట. అదే సమయంలో ఒక సన్నివేశంలో బోయపాటి శ్రీను బాలయ్య పొట్ట భాగాన్ని ఎఫెక్ట్ తో ద్వారా దాచే ప్రయత్నం చేయడం మాత్రం ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుందట. అయితే ఇక స్టోరీ మొత్తం ఒకరినొకరు చంపుకుంటూ తెలియని శ్లోకాలతో ఎపిసోడ్ సాగిపోతుండగా ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: