పూజా హెగ్డే మాట్లాడుతూ.. మిస్ ఇండియా కోసం..ఫోటోల కోసం మొదటిసారి పోర్ట్ పోలియో ఫోటోలు దిగిందట. ఇక అప్పటి వరకు వాటి గురించి ఆమెకు అస్సలు తెలియదు అని సమాచారం. ఇక మొదటిసారి ఈమె చేసిన ప్రకటన ఏమిటంటే రన్బీర్ కపూర్ తో స్కూటీ యాడ్ కోసం రన్ బీర్ కపూర్ తో కలిసి నటించింది.. అంతేకాదు తొలి అంతర్జాతీయ ట్రిప్ ఆమెకు థాయిలాండ్ అట. తన కుటుంబం అంతా కలిసి కొన్ని రోజులు అక్కడ కూడా సరదాగా గడిపి వచ్చారని ఈ విషయాన్ని పూజ తెలిపింది.ఇక మొదటి సారి ఈమె బిఎమ్డబ్ల్యూ 5-సిరీస్ చూసి భలే ఉంది దీనిని ఎలా అయినా సరే కొనాలి అని అనుకునేదట. కాని ఎట్టకేలకు కొనేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఈమె చిన్నప్పుడే కొరియోగ్రఫీ నేర్చుకుందట. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆమె తాతగారు క్రీడా సంస్థ కోసం సర్టిఫికెట్లను కూడా రాయించేవారు అట. రాయించుకున్న తర్వాత 300 రూపాయలు ఇచ్చేవారట. పూజ హెగ్డే తొలి సంపాదన ఇదే కావడం గమనార్హం. ఇక టీనేజర్ గా మొదటిసారి మోడలింగ్ చేసి ఐదు వేల రూపాయలను చెక్కులు అందుకున్నదట ఈ ముద్దుగుమ్మ.. అంతేకాదు స్కూల్ లో టీచర్స్ డే రోజు మొదటిసారి వాళ్ళ అమ్మ చీర కట్టుకొని స్కూల్ కి వెళ్ళింది అట. ఈ విషయాలన్నీ పూజ స్వయంగా వెల్లడించింది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి