మెగాస్టార్ చిరంజీవిని రికార్డులకే రాజుగా చెబుతారు. ఆయన రావడంతోనే టాలీవుడ్ ని మొత్తం మార్చేశారు. అప్పటిదాకా నడుస్తూ వస్తున్న టాలీవుడ్ ని పరుగులు పెట్టించారు. ఆయన ఫైట్లు, డ్యాన్సులతో టాలీవుడ్ ఒక్కసారిగా వందడుగులు పరుగులు తీసింది.

ఈ విషయంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఇక చిరంజీవి స్టార్ అయ్యాక ఎన్నో రికార్డులను సాధించారు. ఫస్ట్ కోటి రూపాయల కలెక్షన్ల నుంచి ఎన్నో రకాలుగా హిస్టరీ క్రియేట్ చేసి తన పేరు రాసేసుకున్నారు. ఇపుడు చిరంజీవి మరో రికార్డుని టార్గెట్ చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో మరో పాతిక చిత్రాలు నటించాలన్నది ఆయన ఆలోచనగా ఉంది అంటున్నారు.

తనకు ఉన్న మెగా స్టార్ స్టామినాతో ఏడాదికి కనీసం నాలుగు సినిమాలు చేయడం ద్వారా అయిదారేళ్ల వ్యవధిలొనే ఈ టాస్క్ ని ఫినిష్ చేయాలని చూస్తున్నారు. మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చి  150 సినిమాల మార్క్ ని చేరుకున్నారు. ఇక  సైరా తో 151 అయింది. ఇక ఆచార్య 152గా ఉంది. ఇదిలా ఉండగానే మరో నాలుగు సినిమాలను సెట్స్ మీదకు తెచ్చేశారు. వీటితో పాటు మరిన్ని సినిమాలకు కూడా ఆయన కమిట్ అవుతున్నారు.

ఇలా తనతో గతంలో ఎన్నడూ చేయని వారు, కొత్త దర్శకులతో సినిమాలు చెసి వరస హిట్లను కొడుతూనే నంబర్ ని కూడా అదే స్థాయిలో పెంచాలని చూస్తున్నారు.  175 మూవీస్ చేసి ఇక సినీ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టాలన్నది చిరంజీవి మార్క్ లక్ష్యంగా ఉంది అంటున్నారు. నిజంగా అదే నిజమైతే మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండుగే. అంతే కాదు, ఈ తరంలో 175 సినిమాలు చేసిన వారు ఎవరూ లేరు. ఇక వస్తారని కూడా నమ్మకాలు లేవు. అంటే చిరంజీవి పెట్టిన రికార్డు అలాగే శాశ్వతంగా ఉండబోతోంది అన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: