తెలుగు ఇండస్ట్రీ అల్ టైమ్ గ్రేట్ కమెడియన్స్‌లో బ్రహ్మానందం అందరికంటే ముందుంటాడని తెలుస్తుంది.ఈ తరం ప్రేక్షకులకు, ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందట.

ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలు చేయలేకపోయినా కూడా బ్రహ్మానందం మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటాదట. ప్రత్యక్షంగా ఆయన కనిపించకపోయినా మీమ్స్ రూపంలో ఎప్పుడు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాడట బ్రహ్మానందం. అయితే కమెడియన్స్ జీవితమంటే కేవలం నువ్వు మాత్రమే కాదు ఎమోషనల్ సైడ్ కూడా ఉంటుందట. తాజాగా ఆలీతో సరదాగా షో కి వచ్చిన బ్రహ్మానందం తనలోని ఆ కోణాన్ని ఆవిష్కరించాడట.. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. వయస్సు సహకరించడం లేదు అంటూ అసలు నిజం ఒప్పుకున్నాడట. తనకు అవకాశాలు రావడం లేదు అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు కానీ వచ్చిన అవకాశాలను కూడా తానే వదిలేస్తున్నాను అనే విషయం వాళ్లకు తెలియదు అంటున్నాడట బ్రహ్మీ.

రెండేళ్ల కింద బ్రహ్మానందానికి హార్ట్ ఆపరేషన్ అయిందని అప్పటి నుంచి సినిమాల సంఖ్య బాగా తగ్గించాడట బ్రహ్మానందం. ఇంట్లో వాళ్లు కూడా విశ్రాంతి తీసుకోవాలని ప్రెజర్ పెట్టడంతో కొన్ని సినిమాలకు మాత్రమే సైన్ చేస్తున్నాడట.. ఇదిలా ఉంటే కోట్లాదిమందిని నవ్వించే బ్రహ్మానందానికి నచ్చిన కమెడియన్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలామందికి ఉంటుందట.
ఈ ప్రశ్నకు ఎమ్మెస్ నారాయణ అనే సమాధానం చెప్పాడట బ్రహ్మానందం. తనకు దేవుడు ఇచ్చిన తమ్ముడు ఎమ్మెస్‌ అని అతడిలో కేవలం కమెడియన్ మాత్రమే కాదు ఒక మంచి విద్యావేత్త ఉన్నాడు అంటూ ప్రశంసల వర్షం కురిపించాడట . ఇక ఆయన చనిపోయే ముందు జరిగిన సన్నివేశం గురించి కూడా గుర్తు చేసుకున్నాడట బ్రహ్మానందం. హాస్పిటల్‌లో ఎమ్మెస్‌ చావుబతుకుల మధ్యలో ఉన్నప్పుడు.. ఒక పేపర్ పెన్ తీసుకొని బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది అంటూ రాసి తన కూతురుకు చూపించాడని తెలిపాడట.

ఆమె తనకు ఫోన్ చేసి విషయం చెప్పిన వెంటనే షూటింగ్ మధ్యలో ఆపుకొని కిమ్స్ హాస్పిటల్ కి వచ్చినట్లు చెప్పాడట బ్రహ్మానందం. తాను వచ్చిన తర్వాత.. తన చేతిలో చెయ్యేసి అలా ఒకసారి కిందికి పైకి చూసి పక్కనే ఉన్న తన కొడుకును తనను మరోసారి చూసి కన్నీరు పెట్టుకున్నాడని చెప్పాడట.తనకు అక్కడ ఉండి ఎమ్మెస్ నారాయణ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోయిందని.. తాను అలా హాస్పిటల్ బయటికి వచ్చిన 15-20 నిమిషాల వ్యవధిలోనే ఎమ్మెస్‌ చనిపోయాడు అంటూ చెప్పుకొచ్చాడట.. ఆ రోజు జరిగిన సంఘటన ఇంకా గుర్తు ఉంది అంటున్నాడట బ్రహ్మానందం. 2017 జనవరి 23న ఎమ్మెస్ నారాయణ కన్నుమూశాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: