ఇక ట్రైలర్ రిలీజ్ తరువాత ఈ మూవీపై అందరిలో ఇప్పటివరకు ఉన్న అంచనాలు అన్ని కూడా అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమాని పాన్ ఇండియా ఇండియా స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రీల్స్ చేసేందుకు మేకర్స్ ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల బాహుబలి రెండు సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా దర్శకుడిగా గొప్ప పేరు, ఇమేజ్ సొంతం చేసుకున్న రాజమౌళి తప్పకుండా ఈ రౌద్రం రణం రుధిరం సినిమా విడుదల తరువాత మరొక భారీ హిట్ కొట్టి తన కెరీర్ లో మరింత గొప్ప క్రేజ్ దక్కించుకోవడం తథ్యం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక హీరోలిద్దరితో పాటు సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఆర్ఆర్ఆర్ మూవీ కోసం దాదాపుగా మూడున్నరేళ్లుగా ఎంతో శ్రమటోడ్చి కష్టపడ్డారని, తమ కష్టం తప్పకుండా ఫలించి ఆర్ఆర్ఆర్ భారీ సక్సెస్ అందుకుని ఇండియన్ సినిమా హిస్టరీ లో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని కూడా వారు అభిప్రాయపడుతున్నారట. ఇక ఈ మూవీ రిలీజ్ తరువాత గత సినిమాల కలెక్షన్స్, రికార్డ్స్ అన్ని బద్దలవ్వడం, అనంతరం పూర్తిగా లెక్కలు అన్ని మారిపోయి చాలావరకు ఆర్ఆర్ఆర్ అన్నిటిని కైవశం చేసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదని అటు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమా రేపు విడుదల తరువాత ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి