సాధారణంగా సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోలు సూపర్ స్టార్ లుగా కొనసాగుతున్నారు. మరి భారత క్రికెట్ ప్రేక్షకులకు సూపర్ స్టార్ ఎవరు అంటే డేవిడ్ వార్నర్ అనే చెప్పాలి. ఎందుకంటే డేవిడ్ వార్నర్ ఒకవైపు క్రికెట్లో అదరకొడుతూ ఉంటాడు. ఒకసారి బ్యాటింగ్కు దిగాడు అంటే చాలు రెచ్చిపోయి మరీ సిక్సర్లు ఫోర్లు కొడుతూ ఉంటాడు. ముఖ్యంగా గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్గా ముందుకు నడిపించి తెలుగు ప్రజలందరికీ ఎంతగానో దగ్గరయ్యాడు.


 ఇలా ఇప్పటివరకు క్రికెట్లో ఎన్నో సార్లు సత్తా చాటిన డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో కూడా సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఎందుకంటే కరోనా వైరస్ సమయంలో ఇంటి పట్టునే వున్నా డేవిడ్ వార్నర్ ఏదో ఒక విధంగా అభిమానులను అలరించాలి అని భావించి టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిపోయాడు.. అప్పట్లో అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో బుట్ట బొమ్మ, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు లో మైండ్ బ్లాక్ పాటలకు తనదైన శైలిలో స్టెప్పులు వేసి తెలుగు అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు డేవిడ్ వార్నర్. ఇక ఆ తర్వాత క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభం కావడంతో ఇక ఎంతగానో బిజీ అయిపోయాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెలుగు ప్రేక్షకులను మాత్రం అలరిస్తూనే ఉన్నాడు.


 ఇక ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను తనదైన శైలిలో ఆశ్చర్యపరిచాడు డేవిడ్ వార్నర్. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటూ ఒక పాట విడుదలైంది. ఇక ఈ పాటను ఇమిటేట్ చేస్తూ అల్లు అర్జున్ స్థానంలో తన ఫొటోలను మార్ఫింగ్ చేసి వీడియో ని తన ఇంస్టాగ్రామ్ ఖాతా లో పోస్ట్ చేశాడు డేవిడ్ వార్నర్. ఇక దీనికి ఏం క్యాప్షన్ పెడతారు అంటూ ఆప్షన్  ప్రేక్షకులకు ఇచ్చేశాడు. ఇక దీనిపై స్పందించిన అల్లు అర్జున్ మై బ్రదర్ వార్నర్.. తగ్గేదేలే అంటూ కామెంట్ చేశాడు. ఇక పుష్పరాజ్ పాత్రలో డేవిడ్ వార్నర్ చూస్తే తెలుగు అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: