
ఇక ఈవెంట్స్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారు పడిన కష్టాన్ని తెలియజేశారు. ఇక రష్మిక స్టేజ్ పైన మాట్లాడుతూ.. చిత్తూరు భాష లో ఒక మాస్ డైలాగ్ కూడా వినిపించి అదరగొట్టింది. అలా డైలాగుతో సరిపెట్టుకోకుండా పాటకి స్టెప్పులు వేయమని అక్కడున్న అభిమానులు అడగడంతో.. సామీ సామీ అనే పాటకు రష్మిక డాన్స్ వేయడం జరుగుతుంది. ఇక ఈమె డాన్స్ కు ఫిదా అయిపోయారు ఆమె అభిమానులు.
ఈమె నటించిన గీత గోవిందం సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చిన అల్లుఅర్జున్ తో ఎప్పటికైనా ఒక సినిమా చేయాలని కోరికగా ఉన్నదని చెప్పిందట . అందుచేతనే పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించడం ఆనందంగా ఉందని తెలియజేసింది. ఇకపోతే అభిమానుల కోలాహలం మధ్య రష్మిక ,అల్లు అర్జున్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక అంతే కాదు రష్మిక ను అల్లు అర్జున్ చూసిన అభిమానులంతా రష్మిక మేడం.. ఇక్కడ ఇక్కడ చూడండి అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి