ఒకనాటి బాలీవుడ్ బ్యూటీ దివ్యభారతి 1990 ప్రాంతాలలో అప్పటి యూత్ కు మంచి క్రేజీ బ్యూటీ. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అప్పటి టాప్ హీరోలు అందరితోను ఆమె నటించడమే కాకుండా ఆమెకు అనేక బ్లాక్ బష్టర్ హిట్స్ ఉన్నాయి. ఒక ప్రమాదంలో ఆమె చనిపోయినప్పటికీ ఇప్పటికీ ఆమె మరణం పై అనేక రూమర్స్ ఉన్నాయి.


ఇప్పుడు మళ్ళీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరో దివ్యభారతి నామస్మరణ జరుగుతోంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈమె 2015 మిస్ మద్రాస్ గా ఎంపిక అయి ఆతరువాత అనేక మోడలింగ్ షోలలో పాల్గొంటూ తమిళనాట యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె జివి.ప్రకాష్ లేటెస్ట్ మూవీ ‘బ్యాచలర్’ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈమధ్య లేటెస్ట్ గా విడుదలైంది.


ఈ ట్రైలర్ లో ఆమె గ్లామర్ ఎక్స్ పోజింగ్ ను చూసిన అనేకమంది తెలుగు నిర్మాతలు దర్శకులు ప్రస్తుతం ఆమె చుట్టూ తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఆమెకు కూడ తెలుగు సినిమాలలో నటించాలని కోరిక ఉన్నప్పటికీ తన దగ్గరకు వస్తున్న దర్శక నిర్మాతల స్థాయిని బట్టి ఆమె చాల సెలెక్టివ్ గా వ్యవహరిస్తున్నట్లు టాక్.


తమిళనాడు లోని యూత్ ఇప్పటికీ చాలామంది చాల డార్క్ కాంప్లెక్షన్ తో ఉంటారు. దీనితో వారికి తెల్లగా ఉండే అమ్మాయిలు అంటే బాగా క్రేజ్. దివ్యభారతి పెద్దగా చెప్పుకోతగ్గ అందగత్తె కానప్పటికీ ఆమె బాగా తెల్లగా ఉండటంతో చాలామంది ఆమెను జూనియర్ మిల్కీ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారట. అయితే మన తెలుగు ప్రేక్షకులు తెలుపు కంటే హీరోయిన్ లోని గ్లో ను చూసి ఇష్టపడతారు. అందువల్లనే డస్కీ బ్యూటీగా పేరుగాంచిన పూజా హెగ్డేకు ఇక్కడ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీనితో ఈ జూనియర్ దివ్యభారాతిని ఎంతవరకు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అన్నది  రానున్న రోజులలో తేలిపోతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: