పులి ని చూసి వాత పెట్టుకోవడం అనే సామెత మనం వినే ఉంటాం. ఎదుటివారు మనకంటే బాగా ఏదైనా పని చేస్తే దాన్ని చూసి మనం వారి లాగానే చేయాలనుకుంటాము. ఈ చర్యకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. సినిమా పరిశ్రమలో పలువురు ఈ సామెతను ఉపయోగించుకుంటూ కొన్ని పనులను చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వారికి అవి కలిసి వస్తాయి. కొన్ని సందర్భాల్లో చెడు ను కలిగిస్తాయి. అలా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చినా అఖండ సినిమా విజయాన్ని చూసి కొంతమంది సర్దుకుంటున్నారు.

బాలకృష్ణ హీరో గా నటించిన ఈ చిత్రం భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం నందమూరి బాలకృష్ణ అద్వితీయ నటన కలగలిపి ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని మంచి కలెక్షన్లను సైతం రాబట్టుకుని తన ఖాతాలో వేసుకుంది. ఆ విధంగా బోయపాటి శ్రీను దర్శకత్వం యొక్క ప్రతిభ నందమూరి బాలకృష్ణ ను ఆయన స్క్రీన్ పై చూపించిన విధానం ఆయన తో పలికించిన డైలాగులు ఆయనకు ఇచ్చిన ఎలివేషన్స్ అన్ని కలగలిపి ఈ సినిమా ఇంత అంత పెద్ద విజయం సాధించడానికి కారణాలు అయ్యాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసి చాలా సినిమాలు సినిమాలు అదే విధంగా ఎలివేషన్ ఇవ్వాలని చెప్పి రీ షూట్స్ చేసుకుంటున్నారు. అలా చిరంజీవి ఆచార్య సినిమాను కూడా రీ షూట్ చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. అఖండ సినిమా విడుదల కాకముందు తమ సినిమా పట్ల ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది ఆచార్య చిత్ర బృందం. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ నిర్మాత దర్శకుడు ఈ సినిమాలోని  కొన్ని సీన్స్ రీ షూట్ చేయాలని భావించారు. దాంతో వారు రీ షూట్ చేయక తప్పడం లేదు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఫిబ్రవరి లో సినిమా ను విడుదల చేయడం కష్టం అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: