ఎప్పటి నుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాల ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రారంభంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఆ సంవత్సరంలోనే ఉంటుంది అని వార్తలు రావడం అయితే ఆ వార్తలకు అనుగుణంగా మోక్షజ్ఞ ఎంట్రీ లేకపోవడం వారికి నిరాశను కల్గిస్తున్న విషయం.
ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య బాలకృష్ణ బోయపాటితో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడాడు అంటూ వచ్చిన వార్తలు బాలయ్య అభిమానులకు మంచి జోష్ ను కల్గిస్తున్నాయి. వాస్తవానికి ఎప్పటి నుండో బాలకృష్ణ తాను నటించబోయే ‘ఆదిత్యా 369’ సీక్వెల్ లో మోక్షజ్ఞ తో ప్రత్యేక పాత్రను చేయించాలని భావిస్తూ వచ్చాడు. అయితే ‘అఖండ’ సూపర్ సక్సస్ తరువాత బాలయ్య ఆలోచనలు మారి బోయపాటి మోక్షజ్ఞ ల కాంబినేషన్ గురించి ఆలోచిస్తున్నట్లు టాక్.
అయితే ఒక సమస్య ఉంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బోయపాటి కొత్త హీరోలతో సినిమాలు చేయడు. కొత్త హీరోల బాధ్యతను తీసుకోవడం బోయపాటికి పెద్దగా ఆశక్తి ఉండడు అంటారు. దీనికితోడు అతడి ఆలోచనలు అన్నీ టాప్ హీరోల చుట్టూ తిరుగుతాయి. ఇలాంటి పరిస్థితులలో బాలయ్య కోరినప్పటికీ బోయపాటి కష్టపడి మోక్షజ్ఞ బాధ్యతను తీసుకునే అవకాశం లేదు అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు ఆ మీడియా సంస్థ మోక్షజ్ఞ విషయమై ప్రచారంలోకి తీసుకు వచ్చిన న్యూస్ నిజం అయితే బాగుండును అంటూ ఆ న్యూస్ కు సంబంధించి అధికారిక ప్రకటన రాకుండానే సోషల్ మీడియాలో బాలయ్య అభిమానుల హడావిడి విపరీతంగా జరుగుతోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి