ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధియేటర్ల పై కొనసాగిస్తున్న దాడులతో 100కు పైగా ధియేటర్లు మూత పడటంతో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాథే శ్యామ్’ లు పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నాయి. ఒకవైపు పెరిగిపోతున్న ఒమైక్రాన్ కేసుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ ఏమైనా కఠినమైన ఆంక్షలు అమలు పరుస్తుందా అన్న సందేహాలతో పాటు ధియేటర్ల పై కొనసాగుతున్న ఈ దాడులు ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతాయో అన్న క్లారిటీ లేకపోవడంతో ఇండస్ట్రీ వర్గాలు అయోమయంలో పడిపోతున్నాయి.
ఇలాంటి పరిస్థితులలో ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్న చిరంజీవి ఈవిషయమై రాయబారాలు చేయడానికి రంగంలోకి దిగినట్లు లీకులు వస్తున్నాయి. అయితే ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవిని గుర్తించి ప్రభుత్వం చిరంజీవిని చర్చలకు ఆహ్వానిస్తుందా లేదంటే చిరంజీవి తనకు తానుగా ఒక మెట్టు దిగి ఆంధ్రప్రదేశ్ అధినాయకత్వంతో చర్చలు జరపడానికి అపాయింట్ మెంట్ కోరతాడా అన్న విషయమై క్లారిటీ లేదు.
నేటితో క్రిస్మస్ హడావిడి పూర్తి అయి తిరిగి అధికారులు మంత్రులు తమతమ పనుల పై దృష్టి పెడతారు కాబట్టి ఒక రెండు రోజులలో క్లారిటీ వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా ‘రాథే శ్యామ్’ దర్శకులు జిల్ రాథా కృష్ణ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ‘రాథే శ్యామ్’ వాయిదా పడుతుందా అన్న విషయమై ఒక ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
ఒక దర్శకుడుగా నిర్మాత హీరో చెప్పిన విధంగా సినిమా తీయడమే తెలుసుకాని ఆసినిమా మార్కెటింగ్ కాని ఆ సినిమా విడుదల తేదీ అదేవిధంగా వాయిదాల విషయమై ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని కామెంట్స్ చేసాడు. దీనితో ‘రాథే శ్యామ్’ వాయిదా పై అప్పుడే ప్రబాస్ తన ఆంతరంగికులతో చర్చలు మొదలుపెట్టాడా అన్న సందేహాలు వెలువడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఒమైక్రాన్ కేసుల గురించి పెద్దగా ఆంక్షలు లేకపోయినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలలో చాల చోట్ల రాత్రి కర్ఫ్యూలు నిన్నటి నుంచి అమలు జరపడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ కూడ వాయిదాల బాట పట్టినా ఆశ్చర్య పడనక్కరలేదు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి