జనవరి 7న రిలీజ్ అవబోతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం చెన్నైలో గ్రాండ్ గా జరుగుతుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాను తమిళనాడులో లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా తమిళ రైట్స్ మొత్తం వారే సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీగానే ప్లాన్ చేశారు. కోలీవుడ్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ లు ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు.

ఇక ఈవెంట్ లో భాగంగా యాంకర్ రాజమౌళిని ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. రాం చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరిలో మీతో ఎవరు బాగుంటారని అడిగారు. అందుకు ఆన్సర్ గా చరణ్ బుడ్ బోయ్.. చాలా మర్యాదగా.. ఉంటాడు. కాని తారక్ బ్యాడ్ బోయ్ అసలు తన మాట లెక్క చేయడు అన్నట్టుగా చెప్పాడు. తారక్ తో రాజమౌళికి ఉన్న చనువు అలాంటిదో అర్ధమవుతుంద్ది.

తారక్ తో ఆల్రెడీ ఇప్పటికే 3 సినిమాలు చేశాడు రాజమౌళి. చరణ్ తో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేశాడు. అదీగాక తారక్ రాజమౌళి ఫ్యామిలీకి చాలా క్లోజ్ గా ఉంటారు అందుకే తారక్ గురించి జక్కన్న సరదాగా బ్యాడ్ బోయ్ అనేశాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో.. తారక్ కొమరం భీం పాత్రలో నటించారు. ఈ పాత్రలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించాడట రాజమౌళి. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఒకదానికి మించి ఒకటి అనేలా ఉంటాయని చెప్పుకుంటున్నారు.  తెలుగులోనే కాదు ఆర్.ఆర్.ఆర్ సినిమాపై తమిళనాడులో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ అక్కడ భారీ రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారట.  అందుకే ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా జక్కన్న ప్లాన్ కు అందరు సూపర్ అనాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: