సమంత రుతు ప్రభ.. ఈ సంవత్సరం ఎంతో మంది హీరోలకు..హీరోయిన్లకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.. గత కొన్ని సంవత్సరాల నుంచి సరైన హిట్ ఒక్కటి  కూడా లేకుండా ఎంతో సతమతమవుతున్న హీరోలకు ఈ సంవత్సరం మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక కేవలం హీరోలకు మాత్రమే కాకుండా హీరోయిన్లకు కూడా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా.. ఈసారి సరికొత్త పాత్రలో దూసుకుపోతున్నారు. ఇకపోతే సమంత కూడా ఒక్క విషయం మినహాయించి ఆమెకు కూడా ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.సమంత.. నాగచైతన్య తో పెళ్లి చేసుకున్న తర్వాత కేవలం తన భర్త తో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేయగలిగింది. ఇక అయితే లేడి ఓరియెంటెడ్ చిత్రాలు అయితే చేస్తాను లేకపోతే చెయ్యను అని తేల్చి చెప్పేసిన సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం  సినిమా కథ వినిపించడానికి వెళ్ళినప్పుడు జూన్ లో పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నాము ఇప్పుడైతే కుదరదు అని దర్శకుడితో చెప్పిందట. కానీ ఏమైందో తెలియదు కానీ ఆగస్టులో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు  సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరినీ శోకసముద్రంలో ముంచేశారు. ఇక తన భర్తతో విడాకులు ప్రకటించిన తర్వాత ఆమె ఏ రేంజ్ లో కాంట్రవర్సి కి గురి అయిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సమంత ప్రవర్తన వల్లే నాగచైతన్య తనను దూరం చేసుకున్నాడు అని, ఆమె కుటుంబంలో ఒకరిగా కలిసిపోలేక పోయింది అని , అక్కినేని కుటుంబం పరువు తీసింది అని, సమంత సెకండ్ సెటప్ అని కూడా చాలా దారుణంగా ఆమెను ట్రోలింగ్ కు గురి చేశారు. నెటిజన్లు, ప్రేక్షకుల నుంచి వచ్చిన మాటలకు వేరే ఎవరైనా సరే వింటే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటారు.. కానీ సమంత మనోధైర్యంతో నిలబడి వరస సినిమాలు చేసుకుంటూ..తనను నిరూపించుకోవడానికి ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా హాలీవుడ్ చిత్రంలో కూడా నటించడానికి ఒప్పుకుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే కూడా ఈ సంవత్సరం ఈమె కు కూడా బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: