గ్లామర్ కథానాయికలకు మాత్రం అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ వారిని స్టార్ హీరోయిన్స్ చేసేసారు. ఆ విధంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మొదటి నుంచి గ్లామర్ ను కాకుండా నటనకు ఆస్కారమున్న పాత్రలో చేయగా వాటి ద్వారా కొంత మంచి పేరు తెచ్చుకున్న కూడా అవకాశాలు మాత్రం దక్కించుకోలేక పోయింది. దాంతో టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ను గమనించిన ఈమె గ్లామర్ పాత్రలు కూడా చేసి మంచి అవకాశాలు దక్కించుకుంది.
ప్రస్తుతం ఆమె చేతిలో రౌడీ బాయ్స్ అనే చిత్రం తప్ప పెద్ద సినిమా ఏదీ లేదు. కానీ ఆమె గ్లామర్ పాత్రలు చేసిన దగ్గర్నుంచి ఆమె పట్ల అటెన్షన్ ఎక్కువైపోయింది. పెద్ద హీరోలు సైతం ఈ ముద్దుగుమ్మను తమ సినిమాలలో పెట్టుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే చిన్న హీరోతో చేసినా సినిమా లో కూడా ఆమె అందాల విందును అంద చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది . రౌడీ బాయ్స్ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తుండగా ఇందులో ప్రేక్షకులను బాగానే కనువిందు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ఆమెకు ఎలాంటి అవకాశాలు లభిస్తాయి అనేది చూడాలి.ఇప్పటికే ఆమెకు టాలీవుడ్ లో క్రేజ్ మాత్రం గట్టిగానే ఉంది. ఆ క్రేజ్ కి తగ్గ అవకాశాలు వస్తాయా చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి