అక్కినేని ఫ్యామిలీకి ఈ సంక్రాంతికి బాగా కలిసొచ్చింది. ఆర్ఆర్ఆర్ రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలు విడుదల కానుండటంతో నాగార్జున నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా ఫిబ్రవరిలో విడుదల చేద్దామని అనుకున్నారు.  కానీ ఈ పెద్ద సినిమాల సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో ఆగమేఘాల మీద సంక్రాంతి సందడి ని క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైపోయింది అక్కినేని ఫ్యామిలీ. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో  నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది బంగార్రాజు సినిమా.


 సంక్రాంతికి అసలుసిసలైన సినిమా బంగార్రాజు నే అని ప్రేక్షకులు భావించే విధంగా అందరినీ ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఫ్యామిలీ సెంటిమెంట్ దగ్గరనుంచి యాక్షన్ సన్నివేశాల వరకు బంగార్రాజు సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం  హిట్ టాక్ దూసుకుపోతుంది. ఈ సంక్రాంతి అక్కినేని ఫ్యామిలీకి కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా వచ్చింది అనే విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఒకప్పటి బంగార్రాజు మనవడిగా జూనియర్ బంగార్రాజు గా కనిపిస్తాడు నాగ చైతన్య. అంతా బాగానే ఉంది కానీ ఒకప్పుడు నాగ చైతన్య  గర్ల్ ఫ్రెండ్ కాస్తా ఇప్పుడు తల్లి గా మారిపోయింది. అదెలా అంటారా.. సోగ్గాడే చిన్నినాయన సినిమా లో  బంగార్రాజు కొడుకు రాము పాత్రలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయగా రాము భార్య సీత పాత్రలో నటించింది లావణ్య త్రిపాటి. ఇక వీరిద్దరి కొడుకే ఇప్పుడు బుల్లి బంగార్రాజు నాగచైతన్య. అంటే ఒక రకంగా ఇప్పుడు నాగచైతన్యకు లావణ్య తిరుపతి తల్లిగా మారినట్లే. అయితే ఒకప్పుడు లావణ్య త్రిపాటి నాగచైతన్య జంటగా యుద్ధం శరణం సినిమా వచ్చింది. లావణ్య, చైతన్య ప్రేమికులుగా నటించారు. గతంలో మనం సినిమాలో ఫ్రెండ్స్ గా నటించారు. ఇక ఇప్పుడు ఏకంగా తల్లి కొడుకుల గా నటించారు. ఏ హీరోయిన్ కూడా హీరోకి మొదట హీరోయిన్ గా తర్వాత స్నేహితురాలిగా ఇక ఆ తర్వాత తల్లిగా నటించిన రికార్డు లేదు.. ఆ రికార్డును లావణ్య త్రిపాటి సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: