ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతో మంది హీరోయిన్లు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొవడం లాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ల శరీరాకృతి పై మాట్లాడుతూ ఎంతో మంది బాడీ షేమింగ్ గురించి హీరోయిన్లను కామెంట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు హీరోయిన్ లు ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటకు చెప్పేవారు కాదు. కానీ ఇటీవల కాలంలో ఎంతో మంది హీరోయిన్లు ఓపెన్ అవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కృతిసనన్ కూడా ఓపెన్ అయ్యింది. తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ఎన్నో రోజుల నుంచి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తుంది కృతిసనన్. కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా చేసుకుంటూ వస్తోంది. ఇటీవలె పరం సుందరి పాట తో కుర్రాళ్ల మనసు దోచేసింది  ఈ హాట్ బ్యూటీ. ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గతంలో టాలీవుడ్ లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నేనొక్కడినే సినిమాలో కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది కృతిసనన్.


 ఇలా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న కృతి సనన్  ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన కొత్తలో బాడీ షేమింగ్ చేసుకోవాలంటూ కామెంట్స్ చేసేవారని ఇటీవల గుర్తు చేసుకుంది. నువ్వు నవ్వితే బాగుండవు.. పేదల ఆకృతి కూడా బాగాలేదు మార్చుకో అంటూ కొంతమంది కామెంట్ చేసే వారట. ఇంకొంతమంది అయితే నీ ముక్కు అసలు సరిగ్గా లేదు.. నవ్వినప్పుడు నాసికా రంధ్రాలు ఎర్రబడి పోతున్నాయి అంటూ కామెంట్ చేసి ఇబ్బందులకు గురి చేశారట. మరి కొంతమంది నీ నడుము మరింత తగ్గించుకో అంటూ కూడా కామెంట్ చేశారట. ఇక ఇలాంటి కామెంట్స్ అన్నిటిని కూడా పట్టించుకోకుండా తనలా తాను ఉంటూ వచ్చాను అంటూ చెబుతుంది ఈ స్టార్ హీరోయిన్. ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బిందాస్ గా ఉండాలంటూ చెబుతుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: