ప్రేక్షకుల్లో అంచనాలు పెంచితే భారీ ఓపెనింగ్స్ ఊహించిన రీతిలో వస్తాయి. అదే అంచనాలని అందుకోలేకపోతే నిరుత్సాహ పడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకుపోయాడు. ప్రేక్షకుల అంచనాలని మార్చడానికి వేరియేషన్‌ స్టార్‌గా మారుతున్నాడు. స్టార్‌ డైరెక్టర్ల సపోర్ట్‌తో కొత్త ఇమేజ్‌ కోసం ప్రయత్నిస్తున్నాడు.  

విజయ్‌ దేవరకొండకి 'అర్జున్‌ రెడ్డి' సినిమాతో సూపర్‌ ఇమేజ్ సంపాదించుకున్నాడు. యాంగ్రీయంగ్‌మెన్, రౌడీ ఇలా బోల్డన్ని బిరుదులు కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత 'గీతగోవిందం' సినిమాలో సాఫ్ట్‌గా కనిపించినా, ఆడియన్స్‌ కు రౌడీ ఇమేజ్‌ లోనే కనిపించాడు. దీంతో ప్రతీ సినిమాలోనూ విజయ్‌ని అదే రీతిలో  ఊహించేసుకుంటున్నారు ప్రేక్షకులు. అయితే ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మ్యాచ్ చేయడంలో  ఏమాత్రం తేడాలొచ్చినా ఫలితం మాత్రం తేడా కొట్టేస్తోంది.

ప్రేక్షకులకు కొత్త విజయ్ దేవరకొండని చూపిస్తే గానీ, ఆ అంచనాలు మారిపోయే అవకాశం లేదు. సినిమా సినిమాకి వేరియేషన్‌ చూపిస్తేనే ఆడియన్స్‌ థ్రిల్ గా ఫీలవుతారు. అందుకే డిఫరెంట్‌ స్టైల్స్‌ ఉన్న మేకర్స్‌తో సినిమాలు చేస్తున్నాడు ఈ రౌడీ హీరో. మాసీ పంచ్‌ డైలాగ్స్‌తో అదరగొట్టే పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో 'లైగర్' అనే సినిమా చేస్తున్నాడు.  

విజయ్‌ దేవరకొండ తర్వాత సుకుమార్‌తోనూ ఒక సినిమా చేయబోతున్నాడు. హీరోలని ఊరమాస్, లేకపోతే కంప్లీట్‌ స్టైలిష్‌గా ప్రజెంట్‌ చేసే సుక్కు, విజయ్‌తో ఎలాంటి సినిమా తీస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. వీటితోపాటు ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామాలు తీసే శివ నిర్వాణ దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయబోతున్నాడు. మరి ఈ మూవీస్‌తో విజయ్‌కి ఎలాంటి ఇమేజ్‌ వస్తుందో చూడాలి.


మొత్తానికి విజయ్ దేవరకొండ ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేశాడు. తన సినిమాల్లో హీరోయిన్స్ తో చేసే రొమాన్స్ తో కుర్రకారులో గిలిగింతలు పెట్టేశాడు. ఇంకేముందీ విజయ్ ను మరిచిపోలేకపోతున్నారు యువకులు. విజయ్ ఏ సినిమాలో నటించినా.. అదేలా చూస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: