'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా హీరో ఎలా అయ్యాడో సుకుమార్‌ కూడా అలానే పాన్‌ ఇండియా దర్శకుడు అవుతున్నాడు. అంటే ఇకపై ఆయన తీసే సినిమాలన్నీ కూడా పాన్‌ ఇండియా సినిమాలు అవుతాయి అని చెప్పలేం కాని.. సుకుమార్ గురించి ఇంకా అతని దర్శకత్వ ప్రతిభ గురించి ఇప్పుడు దేశం మొత్తం కూడా చర్చించుకుంటోంది. అంతేకాదు మాతో సినిమా చేయండి అని కూడా హీరోలు అడుగుతున్నారు.'పుష్ప' సినిమా విషయానికి వస్తే ఖచ్చితంగా చర్చల్లోకి వచ్చే పేర్లు అల్లు అర్జున్‌ ఇంకా సుకుమార్‌. ఆ ఇద్దరి ఆలోచనలతో అంత కష్టమైన సినిమా ఎంచుకోవడం దాన్ని రూపొందించడం చాలా కష్టమనే చెప్పాలి. దాన్ని రూపొందించి మెప్పించేలా చేయడమూ కూడా అంతే కష్టమని చెప్పాలి. ఈ పని చేసి చూపించారు సుక్కు ఇంకా బన్నీ. అందుకే ఈ సినిమాకు కేవలం తెలుగులోనే కాకుండా ఇతర పరిశ్రమల్లో కూడా మంచి పేరొస్తుంది. ఆ సినిమాకు ఫలితం కూడా ఇప్పుడు బాగా వస్తోంది. మొన్నటి వరకు అల్లు అర్జున్‌కు ప్రశంసలు ఇంకా పేర్లు వచ్చాయి. ఇప్పుడు సుక్కుకి కూడా అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి.

'పుష్ప' సినిమా మేకింగ్‌ను మెచ్చుకుంటూ మన స్టార్ హీరోలతో పాటు ఇతర భాష స్టార్‌ హీరోలు కూడా సుకుమార్‌ను బాగా మెచ్చుకుంటున్నారు. టాలీవుడ్‌ హీరోలను పక్కనపెడితే బయట సినిమా ఇండస్ట్రీ నుండి కూడా సుకుమార్‌కు ప్రశంసలు వస్తున్నాయి. అలా తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్‌ నుండి సుకుమార్‌కు ప్రశంసలే కాదు. తనతో ఓ సినిమా చేయమని కూడా ఆఫర్ వచ్చిందట. ఈ మేరకు సుకుమార్‌ ఆయనకు ఓ కథ లైన్‌ చెప్పారని, త్వరలో దాన్ని పూర్తిగా రెడీ చేసి మరోసారి వినిపిస్తారని సమాచారం. అన్నీ ఓకే అనుకుంటే వీరిద్దరి కాంబోలో సినిమా ముందుకెళ్తుందట. ఇది ఓకే అయితే ధనుష్‌ కి ఇక స్ట్రయిట్‌ గా ఇది మూడో తెలుగు సినిమా అవుతుంది.ఇప్పటికే ధనుష్‌ శేఖర్‌ కమ్ములతో ఓ సినిమా ఇంకా వెంకీ అట్లూరితో 'సర్‌' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండూ ఈమధ్యనే స్టార్ట్‌ అయ్యాయి.

ఇక అలాగే మొన్నీమధ్య బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా ఇలానే సుకుమార్‌ను 'నాతో ఒక సినిమా చేయండి' అని అడిగాడట.ఈ రకంగా సుకుమార్‌ పాన్‌ ఇండియా దర్శకుడు అవుతున్నాడు.ఇక పుష్ప సినిమా ముందు దాకా పక్క ఇండస్ట్రీ వాళ్లకు గుర్తొచ్చే తెలుగు స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాత్రమే. ఇక పుష్పతో ఇప్పుడు సుక్కు కూడా అందరి కంట్లో పడి జక్కన్న అనుకున్న విధంగా ఆయనకు పోటీ ఇచ్చే దర్శకుడిగా మారాడు. ఇక ఇంకో పాన్ ఇండియా హిట్టు కనుక సుక్కుకి పడితే జక్కన్నకు చిక్కులా మారడం ఖాయమేమో అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: