ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాలు చెప్పిన తేదీకి విడుదల అవుతాయో, ఏ సినిమాలు విడుదల కావో అర్థం కావట్లేదు. కొన్ని సినిమాలను పలానా తేదీలో విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఆ సమయంలో కరోనా అధికంగా ఉండడం మరియు ఇతర కారణాల వల్ల  ఆ సినిమాలను విడుదల చేయలేక పోతున్నారు. మరికొన్ని సినిమాలు షూటింగ్ దశలోనే కరోనా ప్రభావం వల్ల వాయిదా పడుతూ ఆలస్యం అవుతూ వస్తున్నాయి, ఇలా ఏదైనా కాస్త కరోనా తగ్గుముఖం పట్టిన సమయం దొరికినప్పుడు  వరసపెట్టి సినిమాలు థియేటర్ లలో విడుదల అవుతున్నాయి. అలా ఏప్రిల్ 14 వ తేదీన మూడు భారీ సినిమాల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొనే పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు విషయం లోకి వస్తే.. యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్ వన్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే, ప్రస్తుతం ఎంతో మంది ప్రేక్షకులు కేజిఎఫ్ చాప్టర్ టు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 14 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.  

 ఈ సినిమాతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమాను కూడా ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది, ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాను కూడా ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇలా ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు కలిగి ఉన్న ఈ మూడు సినిమాలను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా విడుదల తేదీలలో ఏమైనా మార్పులు జరుగుతాయో లేదా విడుదల అవుతాయో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: