పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ప్రాజక్ట్ కె, ఆదిపురుష్ సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా వీటిలో రాధేశ్యామ్ కొన్నాళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుంది, వాస్తవానికి ఈ సినిమా ఈ నెల 14న సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకడు.
ఇక సలార్ విషయానికి వస్తే కెజిఎఫ్ సినిమాల దర్శకడు ప్రశాంత్ నీల్ తీస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలె ఫిలిమ్స్ వారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. ఓం రౌత్ తీస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాని టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఫైనల్ గా సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజక్ట్ కె ని నాగ అశ్విన్ తెరకెక్కిస్తుండగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.


అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలు అన్ని కూడా ఎంతో గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుండగా మధ్యలో ఒక చిన్న సినిమా చేసి, నాలుగు నెలల్లో పూర్తి చేసి ప్రేక్షకాభిమానులు ముందుకు తీసుకురావాలని భావించిన ప్రభాస్, ఇటీవల యువ దర్శకుడు మారుతిని పిలిపించి ఒక మంచి స్టోరీ సిద్ధం చేయమని చెప్పడం జరిగిందట.

కాగా రాజా డీలక్స్ పేరుతో మంచి హారర్ డ్రామా గా సాగె యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ స్టోరీ సిద్ధం చేసిన దర్శకుడు మారుతి మరొక రెండు రోజుల్లో దానిని ప్రభాస్ కి వినిపించనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. తన స్టైల్ తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నాయని, ఒకవేళ ప్రభాస్సినిమా కథని ఒప్పుకుంటే త్వరలో ఈ మూవీని పట్టాలెక్కించి సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట మారుతీ. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ప్రకారం హర్రర్ జానర్ లో సాగె కామెడీ ఎంటర్టైనర్ స్టోరీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, అటువంటి కథ ప్రభాస్ కి ఎంత వరకు సూట్ అవుతుంది, నిజంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందా అనే విషయాలపై పూర్తి క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: