టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు ధీటుగా దూసుకెళ్తున్నాడు. ఈమధ్యే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచిన మెగాస్టార్..ప్రస్తుతం తన కొత్త సినిమాలన్నింటిని సెట్స్ మీదకి తీసుకెళ్ళాడు. ఇప్పటికే మెగాస్టార్ అనౌన్స్ చేసిన సినిమాల్లో 'భోళా శంకర్' కూడా ఒకటి. మెహర్ రమేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'వేదాలం' అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. 

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలి పాత్రలో మహానటి కీర్తి సురేష్ నటిస్తుండగా.. తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ సినిమాలో చెల్లెలి పాత్ర చాలా ముఖ్యమైనదని.. ఈ సినిమా కథ మొత్తం అన్నాచెల్లెల చుట్టూరానే తిరుగుతుందని తెలుస్తోంది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మెహర్ రమేష్రీమేక్ లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసినట్లు సమాచారం. ఇక సినిమాలో చిరు కు జోడిగా తమన్నా మరోసారి కథానాయికగా నటిస్తోంది. ఇంతకుముందు మెగాస్టార్ సరసన సైరా సినిమాలో కనిపించింది తమన్నా. అయితే ఈ సినిమాలో కథాపరంగా హీరో హీరోయిన్ల మధ్య ఎలాంటి డ్యూయెట్లు పెట్టడానికి అవకాశం లేదు.

కానీ మెహర్ రమేష్ ఈ కథలో చేసిన మార్పు చేర్పుల కారణంగా సినిమాలు చిరు,తమన్నాల మధ్య డ్యూయెట్లు ఒక రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే తమన్న డాన్స్ పరంగా మెగాస్టార్ తోనే ప్రశంసలందుకుంది. రామ్ చరణ్ రచ్చ సినిమా సమయంలోనే తమన్నా తో స్టెప్పులు వేయాలని ఉందంటూ చిరంజీవి ఓపెన్ గా చెప్పిన విషయం తెలిసిందే. అందువల్ల ఈ సినిమాలో వీరిద్దరి మధ్య డ్యూయెట్లు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాకి వీరి మధ్య వచ్చే డ్యూయెట్లు హైలెట్ గా ఉండనున్నాయట. ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తుండగా.. యువ సంగీత దర్శకుడు మహాదేశ్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: