సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేక్షకులకి ఈ పేరు అంటే విపరీతమైన క్రేజ్. చేస్తున్న ఏ షో అయినా సరే తన కామెడీతో అలరిస్తూ అవతల వాళ్లు తన మీద వేసిన పంచులను కూడా యాక్సెప్ట్ చేస్తూ స్మాల్ స్క్రీన్ క్రేజీ ఆర్టిస్ట్ గా సుధీర్ మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అతను ఏ షో చేసినా సరే ష్యూర్ షాట్ హిట్ దానిలో తిరుగు ఉండదు. అయితే అతను చేసిన షో సక్సెస్ అయ్యి నెక్స్ట్ సీజన్ అతన్ని తప్పించి వేరే వాళ్లని పెట్టినా ఆడియెన్స్ ఒప్పుకోకుండా సుధీర్ కావాల్సిందే అని డిమాండ్ చేస్తారు.

ఈ క్రమంలో సుధీర్ మీద ఉన్న నమ్మకంతో మల్లె మాట టీం శ్రీదేవి డ్రామా కంపెనీ షో మొదలు పెట్టింది. ఓ పక్క ఎక్స్ ట్రా జబర్దస్త్ లో చేస్తూ మరో పక్క ఢీ షోలో మెంటర్ గా ఉంటూనే శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా చేస్తూ వస్తున్నారు సుధీర్. అయితే ఈమధ్య ఢీ 14 సీజన్ లో సుధీర్ ని తప్పించారు. అప్పటి నుండి సుధీర్ ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటుగా శ్రీదేవి డ్రామా కంపెనీ మీద పూర్తి ఫోకస్ పెట్టారు. సుధీర్ దృష్టి పెడితే షో రేంజ్ మారిపోతుంది. అలానే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.  

ఇది కూడా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రేంజ్ లో పాపులర్ అయ్యింది. అఫ్కోర్స్ అక్కడ కమెడియన్లే ఇక్కడ కూడా ఉండటంతో ఈ షో కూడా సక్సెస్ అయ్యింది. లేటెస్ట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ మొదటి వార్షికోత్సవం ప్రోమో రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ కి గెస్ట్ గా జెడి చక్రవర్తి వచ్చారు. సుధీర్.. హైపర్ ఆది.. రాం ప్రసాద్ వీళ్ల హంగామాతో శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో అదిరిపోయింది. ఈ షో నిలబడటానికి మెయిన్ రీజన్ సుధీర్ అంటున్నారు. ఏది ఏమైనా సుధీర్ ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టే లెక్క.


మరింత సమాచారం తెలుసుకోండి: