యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నరు షణ్ముఖ్, దీప్తి సునైనా. ఇద్దరు అలా కలిసి చేస్తూ లవ్ లో కూడా పడ్డారు. ఈమధ్యనే బిగ్ బాస్ సీజన్ 5 లో జరిగిన కొన్ని కారణాల వల్ల షణ్ముఖ్, దీప్తి సునైనాలు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ క్రమంలో దీప్తి సునైనా బ్రేకప్ టైం లో తనని తాను బలపరుచుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుంది. తన వెనక అధుతమైన ఓ శక్తి ఉందని అదే తన తండ్రి అని ఆయనతో ఉన్న ఒక వీడియో షేర్ చేసింది. ఇక తన రెగ్యులర్ అప్డేట్స్ ని కూడా సోషల్ మీడియాలో పెడుతుంది.

షణ్ముఖ్ కూడా బ్రేకప్ వల్ల కొద్దిగా బాధ లోపల ఉన్నా సరే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సైన్ చేశాడు. ఈ క్రమంలో దీప్తి సునైనా కూడా స్మాల్ స్క్రీన్ వదిలి సిల్వర్ స్క్రీన్ బాట పట్టిందని వార్తలు వచ్చాయి. దీప్తి సునైనా హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుందని. త్వరలోనే ఆమె కథనాయికగా మెరుస్తుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై దీప్తి సునైనా స్పందన షాక్ ఇచ్చింది. తను ఎలాంటి సినిమాలో నటించట్లేదని చెప్పుకొచ్చింది దీప్తి. ప్రస్తుతం సినిమాలు చేయాలన్న ఆలోచన ఏమి లేదని అంటూ షాక్ ఇచ్చింది దీప్తి.

మరి కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలింస్ చేసిన ప్రతి ఒక్కరు తమ ఫైనల్ గోల్ సినిమా హీరోయిన్ గానే అనుకుంటారు. కానీ అలాంటి ఛాన్స్ వచ్చినా సరే దీప్తి సునైనా మాత్రం కాదని చెబుతుందట. ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా ఆమెకి హీరోయిన్ ఆఫర్లు వచ్చినా కాదనేసిందని టాక్. మరి దీప్తి ప్లాన్ ఏంటన్నది ఎవరికి అర్ధం కావట్లేదు. జస్ట్ ఇప్పుడున్న క్రేజ్ చాలని అనుకుంటుందా. వెండితెర మీద నటించాలనే ఆలోచనే ఆమెకి లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా దీప్తి ఇచ్చిన షాక్ కి ఆమె ఫాలోవర్స్ కన్ ఫ్యూజన్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: