సినీ సెలబ్రిటీల డేటింగ్ల్ లు, రిలేషన్షిప్ ల గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులందరికీ ఊహించని రేంజిలో ఆసక్తి ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో సినీ సెలబ్రిటీలు  కూడా బాగా ఫాస్ట్ అయిపోయారు. పెళ్లి చేసుకుని  పద్ధతిగా ఉంటున్నారు అనుకునేలోపే విడాకులు తీసుకుంటున్నారు. ఇక విడాకులు తీసుకున్నారు అన్న షాక్ నుంచి తేరుకునేలోపే మరొకరితో రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నారు. దీంతో అయ్యో పాపం ఇలా విడిపోయారు ఏంటి అని సినీ సెలబ్రిటీల గురించి బాధపడుతున్నా అభిమానులు అంతలోనే కొత్త రిలేషన్షిప్ చూసి అవాక్కవుతున్నారు.


 టాలీవుడ్ లో ఇలాంటివి ఎక్కువగా కనిపించడం లేదు. కానీ బాలీవుడ్లో మాత్రం విడాకులు తీసుకున్నా  ఎంతోమంది హీరో హీరోయిన్లు మరొకరితో రిలేషన్ షిప్ లో కొనసాగుతూ చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ ఉండటం చూస్తూ ఉన్నాం. అయితే బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కూడా ఈ లిస్టులో చేరిపోయాడు.. దాంపత్య బంధానికి గుడ్ బై చెప్పేసి భార్యతో విడాకులు తీసుకున్నాడు హృతిక్ రోషన్. ఇక ఇప్పుడు లేట్ చేయకుండా మరో హీరోయిన్ డేటింగ్ స్టార్ట్ చేశాడట బాలీవుడ్ గ్రీక్ వీరుడు. కొంతకాలం నుంచి ఒక అమ్మాయి తో డేటింగ్ చేస్తున్నాడని ఆ అమ్మాయి ఎవరు అంటూ చర్చ జరిగింది.

 ఇటీవలే ఆ అమ్మాయి ఎవరో క్లారిటీ వచ్చేసింది. ఆ అమ్మాయి ఎవరో కాదు అప్కమింగ్ బ్యూటీ సభ ఆజాద్ అని కనిపెట్టేశారు నెటిజన్లు.  ఇంతకీ సభ ఆజాద్ ఎవరు అనేదాని గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే.. గతంలో దిల్ కబడ్డీ, ముజ్సే ఫ్రెండ్షిప్ కరోగి  చిత్రాల్లో నటించింది సభ ఆజాద్. ఇక 2013లో నసీరుద్దీన్ షా కొడుకు తో డేటింగ్ చేసింది. ఇక ఏళ్లపాటు రిలేషన్షిప్ లో ఉన్న ఈ జంట ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. 2020 లో ఈ జంట విడిపోయింది. అంతలో ఆమెకు హృతిక్ పరిచయమయ్యాడు.ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి పోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇక ప్రస్తుతం డీప్ రిలేషన్షిప్ లో కొనసాగుతున్నారు ఇద్దరు.  ప్రస్తుతం రాకెట్ బాయ్స్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇది సోనీలీవ్ వేదికగా ఫిబ్రవరి 4వ తేదిన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: