అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. వరుస విజయాలతో అదరగొడుతున్నాడు. తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేస్తున్నాడు.. గత ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ తో ప్రేక్షకులను అలరించిన నాగచైతన్య మంచి విజయాన్ని అందుకున్నాడు. తన నటనకు మంచి మార్కులు కూడా కొట్టేసాడు. ఇక ఇటీవలే తన తండ్రితో కలిసి నటించిన బంగార్రాజు సినిమాతో సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులను అలరించాడు. ఇక బంగార్రాజు సినిమాతో అక్కినేని తండ్రి కొడుకుల కు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.

 ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు నాగచైతన్య. ప్రస్తుతం విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన రాసి కన్నా  హీరోయిన్గా నటిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తుండటం గమనార్హం. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న  విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పోస్టర్స్ ని ప్రేక్షకుల ముందుకు విడుదల చేయగా ఇందులో క్రీడాకారుడిగా కనిపించిన చైతు లుక్  అందరిని ఆకర్షించింది.



 టైం ట్రావెల్ కథగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అక్కినేని ప్యామిలితో మనం సినిమాతో హిట్టు కొట్టిన విక్రమ్ కే కుమార్ ఆ తర్వాత పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయాడు. ఇప్పుడు మాత్రం చైతూతో తెరకెక్కించిన థాంక్యూ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ పూర్తి కాగా ఇప్పుడు ప్రీప్రొడక్షన్ పనులు మిగిలి ఉన్నాయి అన్నది తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత తెలుగులో వస్తున్న టైంట్రావెల్ సినిమా ఇదే కావడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: