స్టార్ హీరో అజిత్ అటు కోలీవుడ్ లోనూ ఇటు తెలుగు ఇండస్ట్రీలో మంచి కథానాయకుడు పేరుపొందాడు.. ఇక తను నటించిన ఏ సినిమా అయినా సరే తెలుగు లో కచ్చితంగా డబ్ చేసి విడుదల చేస్తూ ఉంటాడు. అలా ఎన్నో సినిమాలు విడుదల చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు హీరో అజిత్.. దీంతో ఈయనకు అభిమానులు సంఖ్య పెరిగిపోయింది అని చెప్పవచ్చు. తాజాగా ఈయన నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. వలిమై. అయితే ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 24న భారీగా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇదే ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.



ఇక ఫిబ్రవరి 24న తెలుగు రాష్ట్రాలలో కేవలం ఒక్కరోజు మాత్రమే ఎక్కువ థియేటర్లలో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఎందుకంటే ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ విడుదల కాబోతోంది. ఆడవాళ్లు మీకు జోహార్లు, శెబాస్టియన్ పి సి.524, గంగు భాయ్, గని వంటి మూవీ లో కూడా విడుదలవుతున్నాయి. అందుచేతనే వలిమై మూవీ 24 వ తేదీ మాత్రమే పెద్ద ఎత్తున విడుదల కావాల్సి ఉంటుంది.. ఇక అంతే కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ రైట్స్ నాలుగు కోట్ల రూపాయలకు పలికినట్లు సమాచారం.


అయితే వలిమై మూవీ మంచి టాక్ తెచ్చుకుంటే.. మాత్రం కాస్త థియేటర్లో వెసులుబాటు ఉంటుందని చెప్పవచ్చు.. అయితే ఇది అంత సులువైన విషయమేమీ కాదు గతంలో కూడా అజిత్ సినిమాలు విడుదల అయినప్పటికీ.. అవి వెనుకంజలో ఉండే సందర్భాలు చాలానే ఉన్నాయట. అయితే తెలుగులో అజిత్ సినిమాలు విడుదల చేసే సమయం సరిగ్గా లేకపోవడంతోనే ఈయన సినిమాలో కొన్ని టీవీ లో మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటాయి. అయితే ఇటీవల వలిమై.. మూవీ సెన్సార్ పూర్తి గంటల 56 నిమిషాల టైం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: