అల్లు అరవింద్‌, మధు మంతెన సంయుక్త నిర్మాణంలో 'రామాయణం' సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పటి నుంచి రాముడి పాత్ర గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పాన్‌ ఇండియన్‌ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం మహేశ్‌ బాబుని సంప్రదించారని, రాముడి పాత్ర చేసేందుకు మహేశ్‌ కూడా పాజిటివ్‌గానే ఉన్నాడని తెలుస్తోంది.

మహేశ్‌ బాబుని రాముడి పాత్రకి తీసుకొని, బాలీవుడ్‌ స్టార్‌ని రావణాసురుడిగా తీసుకొస్తే, సౌత్‌, నార్త్‌ రెండు మార్కెట్స్‌ని మేనేజ్ చేయొచ్చు అనుకుంటున్నారట మేకర్స్. అందుకే మహేశ్‌తో ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిగాయని తెలుస్తోంది. అయితే మహేశ్ మాత్రం కాల్షీట్స్‌ అడ్జస్ట్‌ చేసే పరిస్థితిలో లేడని తెలుస్తోంది. మహేశ్‌ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' పాడుతున్నాడు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక సినిమాకి సైన్ చేశాడు. వీటితోపాటు రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్‌ ఇండియన్‌ మూవీ చెయ్యబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్స్‌ కంప్లీట్‌ కావడానికి మరో రెండేళ్లు పడుతుంది. దీంతో రామాయణం సినిమాకి కాల్షీట్స్‌ అడ్జెస్ట్ చేయలేకపోతున్నాడట  మహేశ్ బాబు.

'రామాయణం త్రీడి' యూనిట్‌ మరో ఆప్షన్‌ కూడా చూసుకుంటోంది. సౌత్‌ స్టార్ రాకపోతే నార్త్‌ హీరోని తీసుకుందాం అనే ఆలోచనలో ఉందట. ఇండియన్‌ సినిమాలో వన్‌ ఆఫ్ ది ఫైనస్ట్ యాక్టర్‌గా బోల్డంత ఫాలోయింగ్‌ తెచ్చుకున్న హీరోని వెండితెర రాముడిగా మార్చాలనుకుంటున్నారు మేకర్స్. మధు మంతెన అండ్‌ టీమ్ మహేశ్‌ బాబుతో పాటు రణ్‌బీర్‌ కపూర్‌ని కూడా సంప్రదించారట. ఇప్పటికే చాలాసార్లు మీటింగ్స్‌ జరిగాయని, లాస్ట్‌ డిసెంబర్‌లో కూడా సిట్టింగ్‌ జరిగిందని చెప్తున్నారు. 'బ్రహ్మాస్త్ర' పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేసిన రణ్‌బీర్ 'రామాయణం'కి పాజిటివ్‌గానే రియాక్ట్‌ అయ్యాడని తెలుస్తోంది. అయితే కాల్షీట్స్‌ మాత్రం ఇవ్వలేదట.

'రామాయణం' సినిమాలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్‌ రావణాసురుడి పాత్ర పోషించడానికి ఓకే చెప్పాడట. ఆల్రెడీ క్యారెక్టర్‌ కోసం ప్రిపరేషన్స్‌ కూడా మొదలుపెట్టాడని, రాముడి పాత్రకి హీరో ఫైనల్‌ కాగానే సెట్స్‌కి వెళ్తాడని చెప్తున్నారు. ఇక ఈ హీరో 'విక్రమ్‌ వేద' రీమేక్‌లో గ్రే షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ ప్లే చేస్తున్నాడు. ఇక విక్రమ్‌ వేద రీమేక్‌లో నటిస్తోన్న మరో హీరో సైఫ్ అలీ ఖాన్‌ 'ఆదిపురుష్'లో రావణాసురుడిగా నటిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: