తెలుగు బుల్లితెర పై సక్సెస్ ఫుల్ కామెడీ షో ఏది అంటే అందరూ టక్కున చెప్పేస్తారు ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అని.. ఎందుకంటే ఒక సాదా సీదా కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్తీ ఇప్పుడు బుల్లితెరపై ఏ షోకి సాధ్యం కాని రీతిలో రికార్డులు సృష్టిస్తుంది అని చెప్పాలి. ప్రేక్షకులందరినీ ప్రతివారం కడుపుబ్బా నవ్వించడమే కాదు ఎంతో కమెడియన్ కి జబర్దస్త్ కార్యక్రమం లైఫ్ ఇచ్చింది అని చెప్పాలి. ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం లో ఎప్పుడూ ఏదో ఒక జంట హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇటీవల కాలంలో వర్ష ఇమ్మానియేల్ జంట జబర్దస్త్ బ్లాక్ అండ్ వైట్ జోడిగా పేరు సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇక వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అని జబర్దస్త్ నిర్వాహకులు బుల్లితెర ప్రేక్షకులను నమ్మించేందుకు  తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. యాంకర్ రష్మి సుడిగాలి సుధీర్ జోడి తర్వాత జబర్దస్త్ లో బాగా పాపులారిటీ సంపాదించింది మాత్రం ఇమాన్యుల్ వర్ష జోడి అని చెప్పాలి. ఇక వీరిద్దరూ కలిసి స్కిట్లు కూడా చేస్తూ ఉండడంతో ఆ స్కిట్లు చూడటానికి బుల్లితెర ప్రేక్షకులను తెగ ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇమ్మానియేల్ లేకుండా నా లైఫ్ ఊహించుకోలేను అంటూ వర్ష కెమెరా ముందు చెప్పడంతో వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారు అంటూ అందరూ ఫిక్స్ అయిపోయారు.


 ఇకపోతే ఇటీవల ఇమ్మానియేల్ కు వర్షం బిగ్ షాక్ ఇచ్చింది. తనకు ముందే లవర్ ఉన్నాడు అంటూ అసలు సీక్రెట్ బయటపెట్టింది. దీంతో ఇమ్మానియేల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అని చెప్పాలి. అయితే ఇదంతా నిజజీవితంలో కాదు కేవలం జబర్దస్త్ లోని ఒక స్కిట్ లో భాగంగా.. ఇటీవలే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో బలవంతంగా ఇమ్మానియేల్ ను పెళ్లి చేసుకుంటుంది వర్ష.. ఫస్ట్ నైట్ రోజు ఇమాన్యుల్ వర్షను టచ్ చేయగానే ప్రభ అంటూ అరుస్తోంది వర్ష. ఇమాన్యుల్ షాక్ అవుతాడు. అంతకు ముందు ఆమెకు ఒక ప్రియుడు ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుని ఆ తర్వాత ఆశ్చర్యపోతాడు. అచ్చంగా ఇలాంటి పరిస్థితి భాస్కర్ కి కూడా ఎదురవుతుంది. ఈ సన్నివేశం నవ్వులు పోయిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: