శ్రియా సరన్.. Ee అమ్మడి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడి పేరు చెప్పగానే ఎన్నో సినిమాలు ఆలోచనల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి దాదాపు రెండు దశాబ్దాల క్రితం వచ్చింది ఈ ముద్దుగుమ్మ. దాదాపు దశాబ్ద కాలానికి పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అందరి హీరోల సరసన మెరిసింది. ఇక ఇప్పుడు కూడా ఎన్నో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా శ్రియా సరన్ క్రేజ్ మాత్రం తగ్గలేదు అని చెప్పాలి. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో కూడా జోడీ కట్టి మంచి క్రేజ్ తెజో దూసుకుపోతుంది శ్రీయ శరన్ .



 అయితే ఇటీవలి కాలంలో ఈ అమ్మడు సినిమాలతో కంటే తన భర్త తో చేసే రొమాన్స్ తోనే సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ తన భర్తతో కలిసి హాట్ గా రొమాన్స్ చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆశ్చర్య పరుస్తుంది శ్రియ. ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించినా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవల బుల్లితెర కార్యక్రమాల్లో కూడా శ్రియా సరన్ భర్త  ఆండ్రు తో కలిసి సందడి చేస్తోంది. ఇకపోతే ఇటీవల అభిమానులందరికీ షాక్ కి గురి చేసే ఒక విషయాన్ని తెలిపింది శ్రియా సరన్.


 తన భర్త ఆండ్రూ హార్నియ వ్యాదితో పడుతున్నాడని రెండు నెలల క్రితం కనీసం తన కూతురిని ఎత్తుకోలేని స్థితిలో అతని ఆరోగ్యం ఉంది అంటూ శ్రీయ చెప్పుకొచ్చింది. ఇక అదే సమయంలో అపోలో ఆసుపత్రిలో సర్జరీ చేయించామని ఆ సర్జరీ సక్సెస్ అయింది అంటూ చెప్పుకొచ్చింది. హాస్పిటల్ యాజమాన్యానికి ఉపాసనకు  కృతజ్ఞతలు తెలిపింది. అయితే కనీసం తన కూతురుని ఎత్తుకోలేనంత ఆరోగ్య పరిస్థితికి శ్రీయ శరన్ భర్త అండ్రు చేరడంతో అసలు ఆ వ్యాధి ఏంటి అందరూ తెలుసుకోవడం  మొదలుపెట్టారు. హెర్నియా అనే వ్యాధి కడుపుకు సంబంధించినదట. అంతే కాదు ఇది చాలా రకాలుగా కూడా ఉంటుంది. కాగా ప్రస్తుతం ఆండ్రూ  పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడట..

మరింత సమాచారం తెలుసుకోండి: