ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఒకటే మాట వినిపిస్తోంది.. గత మూడేళ్లకు పైగా సినిమా షూటింగ్ జరుగుతూనె వుంది. షూటింగ్ పనులు పూర్తి అయిన తర్వాత విడుదల తేదీ అనుకున్న ప్రతిసారి ఏదొక కారణం వల్ల వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు మొత్తానికి సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు విడుదల కానుంది. ఇప్పటివరకు ఈసినిమా నుంచి బయటకు వచ్చిన పోస్టర్లు సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి.. జక్కన్న కూడా సినిమా పై మరింత ఆసక్థిని పెంచేసిందుకు ఒక్కో అప్డేట్ ను వదులుతూ వస్తున్నారు.


ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చేసిన సంగతి తెలిసిందే..ఆర్ఆర్ఆర్ ఫైనల్ కాపీ చూసిన తర్వాత శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమాను పూర్తిగా చూశాను. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆయన అన్నారు..ఈ సినిమా వందల కోట్లు కాదు ఏకంగా 3000 కోట్లు కలెక్షన్లను అందుకుంటుందని ఆయన సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం.బ్రేక్ చేయలేని కొత్త రికార్డులు సృష్టిస్తుంది. బాక్సాఫీస్ వద్ద రూ 3 వేల కోట్లు వసూలు చేస్తుంది. రాసి పెట్టుకోండి అంటూ శివ కుమార్ అన్నారు.


ఇకపోతే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమాకు మంచి హైఫ్ ను అందిస్తుంది. సినిమా నుంచి బయటకు వచ్చిన పోస్టర్లు, ట్రైలర్, టీజర్స్ సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి. అంతేకాదు ఇటీవల విడుదల అయిన ఎత్తరా జెండా పాట జనాలను ఆకట్టుకుంటుంది.. దేశ భక్తిని చూపిస్తుంది. ఇకపోతే ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందే సినీ ఇండస్ట్రీ లో మంచి టాక్ ను అందుకుంది. మరో వారం రోజుల్లో సినిమా థియెటర్లలో సందడి చెయనుంది. మరి జనాల్లొ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి... ఈ సినిమా కూడా ప్రపంచ రికార్డులను అందుకోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: