మహేష్ బాబుకు టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట మహేష్ బాబు అభిమానులు ఉండనే ఉన్నారు. ఇక ఎక్కువగా అమ్మాయిలకు కలల రాకుమారుడిగా పేరుపొందాడు. మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు హిందీ వర్షన్ లో త్వరలోనే బుల్లితెరపై ప్రసారం కానున్నట్లు గా తెలుస్తోంది. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.


మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే కలయికలో వచ్చిన చిత్రం మహర్షి... ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో మనకు తెలిసిన విషయమే. ఈ చిత్రానికి ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ని త్వరలోనే హిందీలో డబ్బింగ్ చేసి బుల్లితెరపై ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక మరొక సినిమా ఏమిటంటే సరిలేరు నీకెవ్వరు. ఇందులో రష్మిక, మహేష్ బాబు కలిసి నటించారు. ఇక ఈ చిత్రం కూడా టాలీవుడ్ లో రికార్డులను తిరగరాసింది అన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను కూడా హిందీలో డబ్బింగ్ చేసి బుల్లితెరపై త్వరలోనే ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు చిత్రాలతో మహేష్బాబు ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఒకవేళ ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయంటే.. మహేష్ ఇక తన సినిమాలను బాలీవుడ్ లో కూడా విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇదంతా కేవలం పాన్ ఇండియా లెవల్లో తన సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గా సమాచారం. మహేష్ బాబు చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో సర్కార్ వారి పాత సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఇక ఈ సినిమా కూడా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నది..

మరింత సమాచారం తెలుసుకోండి: