సినిమా ఇండస్ట్రీలో కొందరు నాటువైల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అటువంటి వారిలో ఒకరే బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఇతను బాలీవుడ్ లో ఒక ప్రభంజనం. 79 ఏళ్ల వయసులోనూ తన నటనా జీవితాన్ని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. టాలెంట్ కు వయసుతో పని లేదని నిరూపిస్తూ వాహ్ వా అనిపించుకుంటున్నారు ఈ సీనియర్ కథానాయకుడు. తాజాగా ఆయన చేసిన ఒక యాక్షన్ సీన్ ఇపుడు వైరల్ గా మారింది. ఇటీవల ఒక క్లిష్టమైన యాక్షన్ సీన్ ను డూప్ లేకుండానే చేసి వారెవ్వా అనిపించారు అమితాబ్.

ఓ యాక్షన్ ప్యాక్ యాడ్ షూటింగ్ సమయంలో బిగ్ బి డూప్ లేకుండా అదరగొట్టారని వెల్లడించారు ఆ యాడ్ డైరెక్టర్. మూడు గట్టి గాజు పలకలను ఆ సన్నివేశంలో పగలకొట్టాల్సి ఉండగా, అమితాబ్ డూప్ వద్దని తానే స్వయంగా పగలకొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారని ఆయన చెప్పుకొచ్చారు. లేదు లేదు నేను చేస్తాను అని బిగ్ బి అంటుంటే... ఏమో అనుకున్నాం. కానీ ఒకే దెబ్బతో ఆయన గాజు పలకలను పగలకొట్టడం తో షూటింగ్ స్పాట్ లో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యాం అని ఆయన అన్నారు. ఈ వయసులోనూ అమితాబ్ అంతే స్ట్రాంగ్ అంతే స్పీడ్ తో తన యాక్టింగ్ లో జోరు చూపెడుతున్నారు అని యాడ్ డైరెక్టర్ మెచ్చుకున్నారు.

వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని అది మన టాలెంట్ కు అడ్డుకాదని మరో సారి నిరూపించారు అమితాబ్ జి అని ఆయనపై ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ నటిస్తూ, నిర్మిస్తూ.. దర్శకత్వం వహించిన సినిమా ‘రన్‌ వే 34’. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 29న ఈ మూవీ రిలీజ్ కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం లో అమితాబ్ పాత్ర సరికొత్తగా ఉండబోతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: