ఇందులో సీనియర్ నటి రాధిక, శరత్ కుమార్, సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 14వ తేదీన జి -5 లో విడుదల కానుంది. అయితే ఇప్పటికే గాలివాన వెబ్ సిరీస్ కు సంబంధించి టీజర్ విడుదల కాగా మరింత ఆసక్తి రేపింది.. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి ట్రైలర్ కూడా విడుదల అవ్వడం జరిగింది. ఈ గాలి వాన ట్రైలర్ ను హీరో నాగార్జున తన ట్విట్టర్ వేదికగా విడుదల చేయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదలచేసి టీమ్ మొత్తానికి కూడా కంగ్రాట్యులేషన్స్ తెలియజేశారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.."రాజు గారు మీ అమ్మాయిని, అల్లుడు గారి ని ఎవరు చంపేశారు అండి అని చెప్పడంతో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఇందులో రెండు కుటుంబాల మధ్య.. ఎదురుగా వచ్చిన తుఫాన్ తో తమ వాళ్లను రక్షించుకునేందుకు చాలా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది . ఈ చిత్రం స్టోరీ అంతా కూడా ఈ రెండు జంటల చుట్టు కథ తిరిగేలా కనిపిస్తోంది. అయితే వీరి ని ఎవరు చంపారు.. ఎందుకు చంపారు.. అనే విషయం తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ట్రైలర్ వైరల్ గా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి