ఇకపోతే వెంకీ అట్లూరి తెలుగు సినిమా దర్శకుడు మాత్రమే కాదు నటుడు కూడా . ఆయన మూడు సినిమాలకు దర్శకత్వం వహించడం జరిగింది. ఇక దర్శకుడు, నటుడు మాత్రమే కాదు మంచి రచయిత కూడా. సినిమాలకు రచయితగా పనిచేశారు. జ్ఞాపకం అనే సినిమా ద్వారా నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత 2010లో వచ్చిన స్నేహగీతం సినిమాకి డైలాగులు ప్రశ్నించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇట్స్ మై లవ్ స్టోరీ కి సంభాషణలు అందించిన వెంకీ అట్లూరి ఆతర్వాత కేరింత సినిమాకి పూర్తి స్థాయిలో రచయితగా పనిచేశారు.
2018లో తొలిప్రేమ సినిమా కి మొదటి సారి దర్శకుడిగా రచయితగా పనిచేశారు. ఇక ఈ సినిమా మంచి విజయం అందుకున్న అని చెప్పవచ్చు. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 2019లో మిస్టర్ మజ్ను అలాగే 2021లో రంగ్ దే సినిమాలకు డైరెక్టర్గా పనిచేశారు. అయితే ఇప్పటివరకు ఈయన బ్లాక్ బస్టర్ విజయాలను అయితే సొంతం చేసుకోలేదు.. కేవలం చిన్నచిన్న హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించటానికి దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించడానికి సిద్ధమవుతున్నాడు వెంకీ అట్లూరి. నేడు పుట్టినరోజు సందర్భంగా సినిమాల పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి