మొత్తంగా కొన్ని వేల థియేటర్స్ లో సినిమాని ఎంతో భారీ స్థాయిలో రిలీజ్ చేసారు నిర్మాతలైన హోంబలే ఫిలిమ్స్ వారు. ఈ సినిమాలో యాష్ కి జోడీగా శ్రీనిధి శెట్టి నటించగా, ప్రశాంత్ నీల్ తీసిన ఈ మూవీ లో ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరి రావు, రవీనా టాండన్, సంజయ్ దత్ వంటి వారు కీలక పాత్రలు చేసారు. ఇక నిన్న తెల్లవారు ఝాము నుండి ఈ సినిమా యొక్క రివ్యూ పలు ఇతర దేశాల నుండి వచ్చింది. అక్కడ సినిమా చూసిన అనేకమంది మూవీ ఎంతో బాగుంది అంటూ ప్రసంశలు కురిపించారు.
అయితే ఫస్ట్ హాఫంతో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంత నెమ్మదించినప్పటికీ సినిమా ఓవరాల్ గా అయితే సూపర్ అని, చాప్టర్ 1 ని మించేలా మరింత అద్భుతంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ మూవీ తీసారని అంటున్నారు. ఇక ముఖ్యంగా సినిమాలో భారీ యాక్షన్, ఫైట్స్ తో పాటు హీరో ఎలివేషన్స్ సీన్స్ అయితే అరాచకం అని, కొన్ని సీన్స్ లో వచ్చే సన్నివేశాలు, వాటికి వచ్చేటువంటి బీజీఎమ్ అయితే మరొక రేంజ్ లో ఉందని, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ భారీ స్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకుని భారతీయ సినిమా ఇండస్ట్రీ లో మరొక అద్భుత సక్సెస్ అందుకున్న సినిమాగా నిలుస్తుందని పలువురు సినిమా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత మేర టాక్ ని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి