అసలు నిజం చెప్పాలంటే క్లైమాక్స్ విని కథకు ఒకే చెప్పేశాను, అంతలా ఆ ముగింపులో కొత్తదనం కనిపించింది అని అన్నారు. నేనే కాదు నిర్మాతకి కూడా కాన్సెప్ట్ తో పాటు క్లైమాక్స్ బాగా నచ్చడంతో ముందుకొచ్చారు అని పేర్కొన్నాడు శ్రీ విష్ణు. ఇక నిన్న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా టాక్ ఎలా ఉంది అంటే... ఎప్పటి లాగే శ్రీ విష్ణు తన నటనతో అలరించాడు, ఇక సినిమా 'భళా' అని చెప్పలేం కానీ ఒకసారి చూడటానికి తందనాన అని తల ఊపుతూ వెళ్లిపోవచ్చు అంటున్నారు. మిశ్రమ స్పందనను తెచ్చుకున్న ఈ చిత్రంతో అంచనాలను రీచ్ అయ్యేలానే ఉన్నాడు శ్రీ విష్ణు.
ఇక చాలా రోజుల తరవాత కనిపించిన హీరోయిన్ కేథరిన్ బాగా అలరించింది, గ్లామర్ తో కాకుండా పాత్రతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిందని అంటున్నారు. హీరో శ్రీ విష్ణు పొగిడిన రేంజ్ లో క్లైమాక్స్ లేదని అసలు క్లైమాక్స్ కన్విన్సింగ్ గా లేదు అని టాక్ వినపడుతోంది. మరి ఈ వీకెం లో వసూళ్లు స్టడీ గా ఉంటేనే నెక్స్ట్ వీక్ వరకు ఉంటుంది.. లేదంటే మహేష్ హీరోగా వస్తున్న సర్కారు వారి పాట సినిమా వచ్చే శుక్రవారం వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఉండలాంటే ఆకట్టుకోవాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి