‘సర్కారు వారి పాట’ కథలో కొత్తదనం లేదు కేవలం మహేష్ అభిమానులకు మాత్రమే బాగా నచ్చుతుంది అన్న కామెంట్స్ వస్తూ ఉండటంతో ఈమూవీ కూడ డివైడ్ టాక్ ను తప్పించుకోలేక పోయింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో మహేష్ తో త్వరలో సినిమాను తీయబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ పై భారీ ఒత్తిడి ఉండే ఆస్కారం కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా ‘సర్కారు వారి పాట’ మూవీ ప్రమోషన్ లో మహేష్ బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలకు తిరిగి సద్దుబాటు చేసినప్పటికీ ఆ వ్యాఖ్యల ప్రభావం మహేష్ పాన్ ఇండియా కెరియర్ పై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించే ఆస్కారం కనిపిస్తోంది.


నన్ను బాలీవుడ్ భరించలేదు అన్న కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో మహేష్ పై బాలీవుడ్ ప్రముఖులు ఎదురు దాడి చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ముఖేష్ భట్ ‘సర్కారు వారి పాట’ విడుదల సమయంలో ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. మహేష్ ను భరించే శక్తి బాలీవుడ్ కు లేనప్పుడు మహేష్ బాలీవుడ్ కు ఎవరు ఆహ్వానిస్తున్నారు అంటూ మాటల దాడి చేసాడు.


‘సర్కారు వారి పాట’ కు డివైడ్ టాక్ వచ్చింది. దీనితో మహేష్ మ్యానియా ఎంతవరకు ఈమూవీని కలక్షన్స్ విషయంలో రక్షిస్తుంది అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ‘ఎఫ్ 3’ విడుదల అయ్యేంతవరకు మరో రెండు వారాలు ఏ భారీ సినిమా మహేష్ సినిమాకు పోటీగా లేకపోవడంతో బయ్యర్లు నష్టాల బాట పట్టకుండా తెరిపిన పడే ఆస్కారం ఉంది. అయితే ఇది అంతా ఈ వీకెండ్ తరువాత ఈమూవీకి వచ్చే కలక్షన్స్ విషయం పై ఆధారపడి ఉంటుంది.


ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే త్రివిక్రమ్ తో చేసే మూవీ విషయమై మహేష్ కథకు సంబంధించి క్లియరెన్స్ ఇస్తే ఈమూవీ షూటింగ్ ను వీలైనంత త్వరలో మొదలుపెట్టాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నాడు. ఈమూవీలో సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేసే విషయంలో మహేష్ త్రివిక్రమ్ ల మధ్య ఇంకా క్లారిటీ రాలేదు అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: