అనూహ్యంగా శాండిల్ వుడ్ నుండి ఎటువంటి అంచనాలు లేకుండా అలా జాలువారిన చిత్రం కేజీఎఫ్. ఈ సినిమా ఏ స్థాయిలో రిలీజ్ అయిన అన్ని భాషల బాక్స్ ఆఫీస్ లు పై ప్రభావం చూపించింది అన్నది తెలిసిందే. సరికొత్త రికార్డుల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ఈ చిత్రం ప్రభాజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫలితం తారా స్థాయికి చేరడంతో సీక్వెల్ కేజీఎఫ్ చాప్టర్ 2 పై అంచనాలు ఒక్కసారిగా తారా స్థాయికి చేరుకోగా రిజల్ట్ కూడా అంతకు మించి అన్నట్లుగా భారీ కలెక్షన్లు రాబట్టింది. 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను క్రాస్ చేసి దూసుకుపోయింది. అయితే చాప్టర్ 2 సినిమా క్లైమాక్స్ లో కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని చిన్న క్లు ఇచ్చారు మేకర్స్. అయితే ఆ విషయంపై తాజాగా అధికార ప్రకటన రావడం తో అభిమానులు సంతోషం తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

తాజాగా kgf నిర్మాత విజయ కిరగదూర్ ఈ విషయాన్ని ప్రకటించారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే kgf 3 మూవీ షూటింగ్ మొదలవుతుంది అని క్లారిటీ ఇచ్చేశారు. అయితే అపుడే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో అందాల తార సమంత కనిపించబోతుంది అని వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం సామ్ ఫుల్ స్వింగ్ లో ఉన్న విషయం తెలిసిందే... టాలీవుడ్ సహా బాలీవుడ్,కోలీవుడ్ లోనూ ఈమెకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఇంతటి క్రేజ్ ఉన్న సామ్ తో kgf 3 లో ఒక స్పెషల్ సాంగ్ చేయిస్తే బాగుంటుందని యోచిస్తున్నారట మేకర్స్ . అయితే దీని గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

పుష్ప చిత్రం లో ఐటెం సాంగ్ లో కనిపించిన సామ్ కుర్ర కారును పరుగులు తీయించింది, యంగ్ స్టార్ హీరోయిన్ లకు సైతం గట్టిగా పోటీ ఇస్తూ వరుస క్రేజీ ఆఫర్లు అందుకుంటోంది ఈ సీనియర్ హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: